న్యూఢిల్లీ, సెప్టెంబర్ 25 : వెండి వెలుగులు జిమ్ముతున్నది. అంతర్జాతీయంగా డిమాండ్ దూసుకుపోవడంతో వెండి ధర చారిత్రక గరిష్ఠ స్థాయికి ఎగబాకింది. న్యూఢిల్లీ బులియన్ మార్కెట్లో కిలో వెండి ఏకంగా రూ.1,000 అధికమై రూ.1.40 లక్షలు పలికినట్టు ఆల్ ఇండియా సరఫా అసోసియేషన్ వెల్లడించింది. గ్లోబల్ మార్కెట్లో ఔన్స్ వెండి ధర 2 శాతం ఎగబాకి చారిత్రక గరిష్ఠ స్థాయి 45.03 డాలర్లకు చేరుకున్నది.
మరోవైపు, బంగారం ధరలు తగ్గుముఖం పడుతున్నా యి. వరుసగా రెండోరోజు గురువారం కూడా పదిగ్రాముల పుత్తడి ధర రూ.630 తగ్గి రూ. 1,17,370గా నమోదైంది. అలాగే 99.5 శాతం స్వచ్ఛత కలిగిన పుత్తడి ధర రూ.700 తగ్గి రూ.1,16,700కి పరిమితమైంది.