Zee MD Puneet Goenka | సోనీలో విలీనం రద్దయినా.. పాజిటివ్‌గానే వ్యవహరిస్తా.. జీ ఎండీ పునీత్ గోయెంకా..
Zee MD Puneet Goenka | జపాన్ ‘కల్వర్ మ్యాక్స్ ఎంటర్టైన్మెంట్ (సోనీ పిక్చర్స్ నెట్వర్క్స్)లో చేసుకున్న విలీన ఒప్పందం రద్దు కావడం దైవ నిర్ణయం అని జీ ఎంటర్టైన్మెంట్ ఎండీ కం సీఈఓ పునీత్ గోయెంకా పేర్కొన్నారు.
Zee MD Puneet Goenka | జపాన్ ‘కల్వర్ మ్యాక్స్ ఎంటర్టైన్మెంట్ (సోనీ పిక్చర్స్ నెట్వర్క్స్)లో చేసుకున్న విలీన ఒప్పందం రద్దు కావడం దైవ నిర్ణయం అని జీ ఎంటర్టైన్మెంట్ ఎండీ కం సీఈఓ పునీత్ గోయెంకా పేర్కొన్నారు. తాను రెండేండ్లుగా ఎంతో నిజాయితీతో సోనీ సంస్థతో విలీనానికి పని చేసిన ఒప్పందం ప్రక్రియ రద్దయినట్లు సోమవారం మెసేజ్ వచ్చిందన్నారు. ఇదంతా కేవలం దైవ నిర్ణయంగా భావిస్తున్నట్లు తెలిపారు. అయినా ఈ నిర్ణయంపై సానుకూల దృక్పథంతో ముందుకు సాగాలని నిర్ణయానికి వచ్చినట్లు చెప్పారు. భారత్‌లో మీడియా, ఎంటర్టైన్మెంట్ రంగంలో అగ్రగామిగా ఉన్న సంస్థ, దాని వాటాదారుల బలోపేతానికి కృషి చేస్తానని ట్వీట్ చేశారు.
2021 డిసెంబర్లో చేసుకున్న విలీన ఒప్పందం రద్దు చేస్తూ జీ ఎంటర్టైన్మెంట్ యాజమాన్యానికి కల్వర్ మ్యాక్స్ ఎంటర్టైన్మెంట్గా మారిన సోనీ పిక్చర్స్ నెట్వర్క్స్ సోమవారం నోటీసు పంపింది. పునీత్ గోయెంకాపై సెబీ ఆరోపణల నేపథ్యంలో ఆయన నాయకత్వం పట్ల సోనీ పిక్చర్స్ అభ్యంతరం చెప్పింది. ఈ విషయమై తమ డిమాండ్లను జీ జీ ఎంటర్టైన్మెంట్ తిరస్కరించడం వల్లే విలీన ఒప్పందం నుంచి సోనీ తప్పుకున్నట్లు సమాచారం.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

