హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 3 (నమస్తే తెలంగాణ): శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రతిష్ఠాత్మక ఎయిర్పోర్ట్ కార్బన్ అక్రిడిటేషన్ సర్టిఫికెట్‌ను అందుకున్నది. కార్బన్ మేనేజ్మెంట్లో గ్లోబల్ ైక్లెమేట్ గోల్స్కుగాను ఎయిర్‌పోర్ట్స్ కౌన్సిల్ ఇంటర్నేషనల్ (ఏసీఐ) లెవెల్ 4+ సర్టిఫికెట్‌ను అందజేసిందని జీఎమ్మార్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వర్గాలు వెల్లడించాయి.
ఆసియా-పసిఫిక్‌లో ఈ గుర్తింపు పొందిన విమానాశ్రయాల్లో జీహెచ్ఐఏఎల్ 6వ స్థానంలో నిలిచింది. ఈ సందర్భంగా జీఎమ్మార్ హైదరాబాద్ సీఈవో ప్రదీప్ పణికర్ మాట్లాడుతూ.. వాతావరణ మార్పులు అత్యంత క్లిష్టమైన సవాలుగా మారాయని, గ్లోబల్ కార్పొరేట్ సిటిజన్‌గా హైదరాబాద్ ఎయిర్‌పోర్టు కార్బన్ ఉద్గారాలను తగ్గించేందుకు బహుళ మార్గాలను నిర్మిస్తోందన్నారు. ఈ గుర్తింపు.. పర్యావరణ బాధ్యతపట్ల తమ నిబద్ధతను పునరుద్ఘాటిస్తుందని తెలిపారు.