World Economic Forum | జనవరి 20 నుంచి దావోస్ సదస్సు.. ఏడుగురు కేంద్ర మంత్రులు.. ముగ్గురు సీఎంలతో భారత్ ప్రతినిధి బృందం.. చర్చనీయాంశాలివే..!
World Economic Forum | వచ్చే జనవరి 20 నుంచి ఐదు రోజులు జరిగే ప్రపంచ ఆర్థిక ఫోరం (డబ్ల్యూఈఎఫ్) సదస్సుకు ఏడుగురు కేంద్ర మంత్రులు, మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మంత్రులు హాజరు కానున్నారు.
World Economic Forum | ప్రతి ఏడాది మాదిరిగానే 2025లోనూ దావోస్‌లో ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సు జరుగనున్నది. వచ్చే జనవరి 20 నుంచి ఐదు రోజులు జరిగే ప్రపంచ ఆర్థిక ఫోరం (డబ్ల్యూఈఎఫ్) సదస్సుకు ఏడుగురు కేంద్ర మంత్రులు, మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మంత్రులు హాజరు కానున్నారు. కేంద్ర మంత్రులు అశ్విని వైష్ణవ్, సీఆర్ పాటిల్, చిరాగ్ పాశ్వాన్, కే రామ్మోహన్ నాయుడు, జయంత్ చౌదరి హాజరవుతారు. వీరితోపాటు ముగ్గురు ముఖ్యమంత్రులు దేవేంద్ర ఫడ్నవీస్ (మహారాష్ట్ర), నారా చంద్రబాబు నాయుడు (ఆంధ్రప్రదేశ్), ఏ రేవంత్ రెడ్డి (తెలంగాణ)తోపాటు వందలాది మంది ప్రభుత్వ అధికారులు, వ్యాపారవేత్తలు హాజరు కానున్నారు.
ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు, తన కొడుకు – మంత్రి నారా లోకేష్ తో కలిసి ప్రపంచ ఆర్థిక ఫోరం సదస్సుకు హాజరవుతారు. కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివ కుమార్, తమిళనాడు మంత్రి టీఆర్బీ రాజా, ఉత్తరప్రదేశ్ మంత్రి సురేశ్ ఖన్నా పాల్గొంటారు. 2025 జనవరి 20 నుంచి ఐదు రోజుల పాటు వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సు జరుగుతుంది. ప్రపంచవ్యాప్తంగా 50 దేశాల అధ్యక్షులు, ప్రధాన మంత్రులు, ఐక్యరాజ్యసమితి, ఐఎంఎఫ్, ప్రపంచ బ్యాంకు, ఇంటర్ పోల్, నాటో, యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్, డబ్ల్యూటీఓ అధికారులు హాజరవుతారు. బంగ్లాదేశ్ ప్రభుత్వ ప్రధాన సలహాదారు- తాత్కాలిక ప్రభుత్వాధినేత మహ్మద్ యూనస్ సహా పాకిస్థాన్, బంగ్లాదేశ్ సీనియర్ మంత్రులు కూడా పాల్గొంటారు.
ప్రభుత్వ అధినేతలు, అధికారులతోపాటు దిగ్గజ కార్పొరేట్ సంస్థల అధిపతులు కూడా సదస్సులో పాల్గొంటారని భావిస్తున్నారు. రిలయన్స్, టాటా సన్స్, అదానీ గ్రూప్, బిర్లా, భారతీ, మహీంద్రా, గోద్రేజ్, జిందాల్, బజాజ్, వేదంతా గ్రూపు సంస్థల ప్రతినిధులు పాల్గొంటారు. ముకేశ్ అంబానీ, గౌతం అదానీల భవిష్యత్ తరం ప్రతినిధులు, ఇన్ఫోసిస్ సీఈఓ సలీల్ పరేఖ్, విప్రో నుంచి రిషాద్ ప్రేమ్ జీ, రెన్యూ సుమంత్ సిన్హా, పేటీఎం విజయ్ శేఖర్ శర్మ, సీరం ఇన్ స్టిట్యూట్ సీఈఓ అదార్ పూనావాలా తదితరులు పాల్గొంటారు.
ఈ సదస్సులో నైతికంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) వాడకం, భూతపం వంటి ఉమ్మడి సవాళ్లు, అధిక రుణ భారం, తక్కువ వృద్ధిరేటు నుంచి బయట పడే మార్గాలపై డబ్ల్యఈఎఫ్ సదస్సులో చర్చిస్తారు. ఏఐ, క్వాంటం టూ ఎనర్జీ టెక్, బయోటెక్, హెల్త్ టెక్ వంటి ఇంటర్ కనెక్టెడ్ టెక్నాలజీస్‌తో ఉత్పాదకత పెంపు, జీవన ప్రమాణాల పెంపుదల తదితర అంశాలపై చర్చిస్తారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Congress | మా ముందుకొచ్చి మాట్లాడే దమ్ముందా?.. కాంగ్రెస్ నేతలకు రైతు సవాల్
Malasiya | భారతీయులకు మలేషియా షాక్.. వీసా ఫ్రీ ఎంట్రీ నిలిపివేత
Aadhar Card | ‘పుట్టిన తేదీకి ఆధార్ కార్డ్ ధ్రువపత్రం కాదు’
PF Withdraw | ఇకపై నెలనెలా పీఎఫ్ విత్‌డ్రా.. సిస్టమాటిక్ విత్‌డ్రాయల్ ప్లాన్‌కు ఈపీఎఫ్‌వో ఆమోదం
Shah Rukh Khan | షారుఖ్ఖాన్అరుదైన ఘనత.. ది 100 గ్రేటెస్ట్ మూవీ స్టార్స్ ఆఫ్ ఆల్‌టైమ్ జాబితాలో చోటు
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

