న్యూఢిల్లీ, నవంబర్ 6 : సేవల రంగం మళ్లీ పడకేసింది. పోటీ తత్వం పెరగడంతోపాటు దేశవ్యాప్తంగా భారీ వర్షాలు కురియడంతో గత నెలకుగాను సర్వీసుల రంగంలో వృద్ధి ఐదు నెలల కనిష్ఠ స్థాయికి జారుకున్నది. భారీ వర్షాల కారణంగా ఉత్పత్తి గణనీయంగా పడిపోవడంతో అక్టోబర్ నెలకుగాను పీఎంఐ బిజినెస్ యాక్టివిటీ ఇండెక్స్ 58.90కి పడిపోయింది. సెప్టెంబర్ నెలలో ఇది 60.9గా ఉన్నది.
50 కంటే తక్కువగా నమోదైతే ఈ రంగం భారీగా పడిపోయినట్టు గుర్తించడం జరుగుతుందని వెల్లడించింది. మే నెల తర్వాత ఇదే కనిష్ఠ స్థాయి వృద్ది. సర్వీసుల విభాగంలో పోటీతత్వం భారీగా పెరగడం, ప్రధాన నగరాల్లో భారీగా వర్షాలు కురియడం సేవల రంగంలో మందకొడి వృద్ధికి కారణమైందని హెచ్ఎస్బీసీ ప్రధాన ఆర్థికవేత్త ప్రంజుల్ భండారి తెలిపారు.