Stock Market Close | భారతీయ స్టాక్ మార్కెట్లు బుధవారం నష్టాల్లో ముగిశాయి. దాదాపు ఆరు రోజుల తర్వాత నిన్న లాభాల్లో ముగిసిన మార్కెట్లు తాజాగా అమ్మకాలతో ఒత్తిడికి గురైంది. మూడురోజుల ఎంపీసీ సమావేశం అనంతరం రిజర్వ్ బ్యాంక్ ఇండియా గవర్నర్ శక్తికాంత దాస్ వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగిస్తున్నట్లుగా ప్రకటించారు. ఆ తర్వాత మార్కెట్లు అమ్మకాలతో ఒడిదుడుకులను ఎదుర్కొన్నాయి. క్రితం సెషన్‌తో పోలిస్తే సెన్సెక్స్ 81,954.58 పాయింట్ల వద్ద భారీ లాభాల్లో మొదలైంది. మధ్యాహ్నం వరకు అదే ఊపును కొనసాగించాయి. ఆర్బీఐ ప్రకటన అనంతరం మార్కెట్లో అమ్మకాలు కనిపించాయి.
ఇంట్రాడేలో 82,319.21 పాయింట్ల గరిష్ఠాన్ని తాకిన సెన్సెక్స్.. అత్యల్పంగా 81,342.89 పాయింట్లకు చేరుకుతున్నది. చివరకు 167.71 పాయింట్లు నష్టంతో 81,467.10 వద్ద స్థిరపడింది. ఇక నిఫ్టీ 31.20 పాయింట్లు పతనమై.. 24,981.95 వద్ద ముగిసింది. ట్రేడింగ్‌లో దాదాపు 2,580 షేర్లు పెరగ్గా.. మరరో 1,201 షేర్లు పతనమయ్యాయి. నిఫ్టీలో ఐటీసీ, నెస్లే, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఓఎన్జీసీ, హెచ్‌యూఎల్ టాప్ లూజర్స్ నిలిచాయి. ట్రెంట్, సిప్లా, టాటా మోటార్స్, ఎస్బీఐ, మారుతీ సుజుకీ లాభపడ్డాయి. బీఎస్ఈ మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ సూచీలు ఒక్కొక్కటి ఒకశాతానికిపైగా వృద్ధిని నమోదు చేశాయి. ఎఫ్ఎంసీజీ 1.3శాతం పడిపోగా.. ఆయిల్, గ్యాస్ 0.6శాతం తగ్గాయి. ఫార్మా, పవర్, రియల్టీ సూచీలు ఒకటి నుంచి 2శాతం వరకు పెరిగాయి.