Business
- Feb 19, 2021 , 01:20:39
VIDEOS
మూడోరోజూ నష్టాల్లోనే

- సెన్సెక్స్ 379, నిఫ్టీ 90 పాయింట్ల నష్టం
ముంబై, ఫిబ్రవరి 18: దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా మూడోరోజు నష్టాల్లోనే ట్రేడయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లో బలహీన సంకేతాలకు తోడు బ్లూచిప్ సంస్థల్లో వెళ్లువెత్తిన అమ్మకాల కారణంగా మదుపరులు అప్రమత్తత పాటించారు. ఫలితంగా సూచీలు నష్టాల్లోనే కొనసాగాయి. బ్యాంకింగ్, ఆర్థిక రంగ షేర్లలో అమ్మకాలు మార్కెట్లను కుదిపేశాయి. దీంతో 30 షేర్ల ఇండెక్స్ సూచీ సెన్సెక్స్ 379.14 పాయింట్లు నష్టపోయి 51,324.69 పాయింట్లకు వద్దకు జారుకోగా, నిఫ్టీ 89.95 పాయింట్లు తగ్గి 15,118.95 వద్ద ముగిసింది. వచ్చే ఆర్థిక సంవత్సరానికి నరేంద్ర మోదీ సర్కార్ ప్రవేశపెట్టిన సార్వత్రిక బడ్జెట్‌తో వరుసగా పదిహేను రోజులుగా సూచీలు ఆకాశమే హద్దుగా దూసుకుపోయాయి.
- బజాజ్ ఫైనాన్స్ 2.43 శాతం తగ్గి టాప్ లూజర్‌గా నిలిచింది.
- కొటక్ బ్యాంక్, మహీంద్రా, నెస్లె, హెచ్డీఎఫ్సీ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్‌ల షేర్లు కూడా తగ్గుముఖం పట్టాయి.
- మరోవైపు ఓఎన్జీసీ, ఎన్టీపీసీ, ఏషియన్ పెయింట్స్, టెక్ మహీంద్రా, పవర్‌గ్రిడ్, ఇండస్ఇండ్ బ్యాంకులు లాభాల్లో ముగిశాయి.
- ఆటో, బ్యాంకింగ్, ఫైనాన్స్, హెల్త్‌కేర్, టెలికం రంగ షేర్లు రెండు శాతం వరకు నష్టపోయాయి. కానీ, ఆయిల్ అండ్ గ్యాస్, యుటిలిటీ, మెటల్ షేర్లు మదుపరులను ఆకట్టుకున్నాయి.
తాజావార్తలు
- బెంగాల్ పోరు : కస్టమర్లను ఊరిస్తున్న ఎన్నికల స్వీట్లు
- రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు కోసం..కడవరకు పోరాడుతాం
- ఏపీలో కొత్తగా 124 కరోనా కేసులు
- సీబీఎస్ఈ 10, 12వ తరగతి పరీక్షల షెడ్యూల్లో సవరణలు
- ప్లీజ్ ఏదైనా చేయండి..కేంద్రమంత్రికి తాప్సీ బాయ్‌ఫ్రెండ్ రిక్వెస్ట్
- ఇక్కడ బంగారం లోన్లపై వడ్డీ చౌక.. ఎంతంటే?!
- విమానంలో కరోనా రోగి.. బయల్దేరే ముందు సిబ్బందికి షాక్!
- టీఆర్ఎస్ ఎన్నారై ప్రజాప్రతినిధులతో రేపు ఎమ్మెల్సీ కవిత సమావేశం
- పెట్రోల్‌పై పన్నుల్లో రాష్ట్రాలకూ ఆదాయం: కేంద్ర ఆర్థికమంత్రి
- టీఆర్ఎస్కు మద్దతు ప్రకటించిన ఆర్‌యూపీపీ, ఎస్‌ఎల్‌టీఏ సంఘాలు
MOST READ
TRENDING