హైదరాబాద్, జనవరి 30: ప్రముఖ విత్తనాల సంస్థ నూజివీడు సీడ్స్ లిమిటెడ్ పరిశోధన రంగాన్ని మరింత బలోపేతం చేయడానికి భారీ పెట్టుబడులు పెట్టబోతున్నది. రైతులకు నాణ్యమైన విత్తనాలు అందించడానికి ఏటా ఆర్అండ్డీ కోసం రూ.50-55 కోట్ల నిధులను ఖర్చు చేస్తున్నట్లు ఎన్ఎస్ఎల్ గ్రూపు చైర్మన్ ప్రభాకర్ తెలిపారు. కొత్తగా 30 వంగడాలను విడుదల చేయబోతుండటంతో వచ్చే నాలుగు నుంచి ఐదేండ్లకాలంలో కంపెనీ ఆదాయం మూడింతలు పెరిగే అవకాశం ఉందన్నారు.
గడిచిన ఆర్థిక సంవత్సరంలో సంస్థ రూ.1,100 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. ప్రస్తుతం సంస్థకు పది రాష్ర్టాల్లో 13 ప్రాసెసింగ్ యూనిట్లు ఉండగా, అలాగే 2 వేలకు పైగా ఉద్యోగులు ఉన్నారు. వచ్చే ఐదేండ్లలో విత్తన అమ్మకాల్లో 30 శాతం వృద్ధిని సాధించనున్నదన్న ధీమాను ఆయన వ్యక్తంచేశారు.