Anil Ambani: అనిల్ అంబానీపై 25 కోట్ల జరిమానా.. అయిదేళ్ల నిషేధం
Anil Ambani: అనిల్ అంబానీపై అయిదేళ్ల నిషేధం విధించింది సెబీ. దీంతో పాటు అతనికి 25 కోట్ల జరిమానా కూడా వేసింది. ఆర్హెచ్ఎఫ్ఎల్ కంపెనీకి చెందిన నిధుల్ని అక్రమరీతిలో తరలించినట్లు ఆరోపణలు ఉన్నాయి.
న్యూఢిల్లీ: వ్యాపారవేత్త అనిల్ అంబానీ(Anil Ambani)పై మార్కెట్ రెగ్యులేటర్ సెబీ అయిదేళ్ల నిషేధం విధించింది. రిలయన్స్ హోం ఫైనాన్స్ కంపెనీకి చెందిన కొంత మంది అధికారులపై కూడా ఆ నిషేధం వర్తించనున్నది. కంపెనీకి చెందిన నిధులను అక్రమంగా తరలించిన కేసులో సెబీ ఈ నిర్ణయం తీసుకున్నది. అనిల్ అంబానీపై 25 కోట్ల ఫైన్ కూడా వేసింది సెబీ. లిస్టెడ్ కంపెనీలో డైరెక్టర్ పోస్టు నుంచి కూడా ఆయన్ను తప్పించారు. సెబీ మొత్తం 222 పేజీల రిపోర్టును రిలీజ్ చేసింది. ఆర్హెచ్ఎఫ్ఎల్ కంపెనీ నుంచి ఫండ్స్ ను దారి మళ్లించినట్లు అనిల్‌పై ఆరోపణలు ఉన్నాయి. అనిల్ అంబానీ వత్తిడి వల్ల కీలక మేనేజ్మెంట్ పదవుల్లో ఉన్న వ్యక్తులు అవినీతికి పాల్పడినట్లు తెలుస్తోంది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
- Tags
- anil ambani
- Banned
- Penalty
- sebi
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

