Singareni | హైదరాబాద్, జూలై 5 (నమస్తే తెలంగాణ) : సింగరేణి సంస్థ ఒడిశాలో చేపట్టిన నైనీ కోల్బ్లాక్లో మరో ముందడుగు పడింది. అత్యంత కీలకమైన 643 హెక్టార్ల అటవీ భూమిని ఒడిశా సర్కార్.. సింగరేణి సంస్థకు బదలాయించింది.
నైనీ కోల్బ్లాక్ను 2015లోనే సింగరేణి దక్కించుకున్నది. ఈ బ్లాక్నకు ఇప్పటికే అన్ని రకాల అనుమతులు మంజూరుకావడంతో వచ్చే మూడు నెలల్లో ఈ బ్లాక్ నుంచి బొగ్గు ఉత్పత్తిని ప్రారంభించాలనుకుంటున్నది. భూమి బదలాయింపుల కోసం సింగరేణి సంస్థ రూ.180 కోట్లను ఒడిశా ప్రభుత్వానికి చెల్లించింది కూడా.
వాస్తవానికి ఈ ప్రాజెక్ట్ కోసం 783 హెక్టార్ల అటవీ భూమిని బదలాయించాలని కోరినప్పటికీ.. తాజాగా 643 హెక్టార్ల భూమిని ఒడిశా ప్రభుత్వం బదలాయించింది. ఏడాదికి 10 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యంగా సింగరేణి నైని బొగ్గుగనిని చేపట్టింది.