సింగరేణి లాభం 1,070 కోట్లు

- 9 నెలల్లో పెరిగిన ఉత్పత్తి, అమ్మకాలు
- 27వేల కోట్ల టర్నోవర్ సాధించాలి: సీఎండీ శ్రీధర్
హైదరాబాద్, జనవరి 8 (నమస్తే తెలంగాణ): సింగరేణి సంస్థ 2021-22 ఆర్థిక సంవత్సరంలోని తొలి తొమ్మిది నెలల్లో రూ.1,070 కోట్ల లాభాలను ఆర్జించింది. గత ఆర్థిక సంవత్సరంలో ఇదే కాలంలో రూ.842 కోట్ల నష్టాలను చవిచూసింది. బొగ్గు అమ్మకాల్లోనూ 58 శాతం వృద్ధి నమోదైంది. బొగ్గు రవాణా కూడా 318 లక్షల టన్నుల నుంచి 484 లక్షల టన్నులకు పెరిగింది. మంచిర్యాల సమీపంలోని సింగరేణి థర్మల్ విద్యుత్తు కేంద్రంలో ఉత్పత్తి గతేడాదిలోని తొలి మూడు త్రైమాసికాలతో పోల్చితే ఈ ఏడాది 30 శాతం వృద్ధి సాధించింది. సింగరేణి నమోదుచేస్తున్న వృద్ధిరేటు, లాభాలు, అమ్మకాలు, విద్యుత్తు ఉత్పత్తిపై సీఎండీ ఎన్ శ్రీధర్ హర్షం వ్యక్తంచేశారు. రానున్న కాలంలో ఇదే ఒరవడిని కొనసాగించి రూ.27 వేల కోట్ల టర్నోవర్ సాధించే దిశగా కృషిచేయాలని ఆకాంక్షించారు. సింగరేణి వ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న దాదాపు 950 కేసుల పరిష్కారం కోసం న్యాయ విభాగానికి అవసరమైన సమాచారాన్ని అందజేయాలని సింగరేణి డైరెక్టర్ ఎన్ బలరాం సంబంధిత అధికారులను ఆదేశించారు. పెండింగ్ కేసుల్లో ఎక్కువగా భూసేకరణ, పునరావాసం, పుట్టినరోజు మార్పు, డిపెండెంట్, సర్వీసుకు సంబంధించినవే ఉన్నాయని పేర్కొన్నారు. ఏరియాల వారీగా పెండింగులో ఉన్న కేసులపై జీఎం (స్ట్రాటజిక్ ప్లానింగ్) జీ సురేందర్ సమీక్షించారు.

మందమర్రిలో ఎక్స్‌ప్లోజివ్స్ ప్లాంట్
ఓపెన్ కాస్ట్ గనుల్లో వాడే పేలుడు పదార్థాల సరఫరా కోసం మందమర్రి ప్రాంతంలో సొంతంగా ఎక్స్‌ప్లోజివ్స్ ప్లాంట్‌ను ఏర్పాటు చేసేందుకు సింగరేణి సన్నాహాలు చేస్తున్నది. ఇప్పటికే ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్‌తో సమాలోచనలు చేసింది. తాజాగా మందమర్రి ప్రాంతంలో ఏడాదికి 40 వేల టన్నుల పేలుడు పదార్థాల(ఎస్ఎంఈ) సైట్ మిక్స్డ్ ఎమాల్షన్ ప్లాంట్‌ను నెలకొల్పాలని నిర్ణయించింది. ఈ ప్లాంట్ ఏర్పాటుకు విధివిధానాలను రూపొందించేందుకు సింగరేణి డైరెక్టర్లు చంద్రశేఖర్, బలరామ్ ఆధ్వర్యంలో హైదరాబాద్ సింగరేణి భవన్లో అధికారులు శనివారం సమావేశమయ్యారు. సింగరేణి సంస్థలో ప్రస్తుతమున్న 19 ఓసీ గనులకు సంబంధించి ఏడాది 3 లక్షల ఎస్ఎంఈ అవసరమవుతుండగా, అందులో 50 వేల టన్నులు రామగుండం, మణుగూరుల్లోని సొంత ప్లాంట్ల ద్వారా సమకూరుతున్నదని, మిగిలిన 2.50 లక్షల టన్నులను ప్రైవేట్ ఎక్స్‌ప్లోజివ్స్ కంపెనీల ద్వారా కొనుగోలు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. అయితే ఎక్స్‌ప్లోజివ్స్‌ను సరఫరాలో కొన్ని కంపెనీలు జాప్యం చేస్తుండగా, ఓసీ గనుల్లో ఉత్పత్తి కుంటుపడుతున్నదని వివరించారు. దానిని నివారించేందుకు సీఎండీ ఎన్ శ్రీధర్ ఆదేశాల మేరకు సింగరేణి ప్రాంతంలోనే ఐవోసీఎల్ భాగస్వామ్యంతో మరో యూనిట్ నెలకొల్పాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఏడాదిలోగా ప్లాంట్ ప్రారంభంకానున్నట్లు అధికారులు వెల్లడించారు.

Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Priyanka Arul | ఓజీ హీరోయిన్ ప్రియాంక మోహన్ సాహసం.. అంధురాలిగా కొత్త అవతారం,బర్త్‌డే పోస్టర్‌తో ఆసక్తి పెంచిన మేకర్స్!
బాలిలో 50 అడుగుల గణేశుడు.. గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు
Raaka | అల్లు అర్జున్ ‘రాకా’ మ్యూజిక్ డైరెక్టర్‌కు షాక్.. ధనుష్ ‘ఓం’తో సాయి అభ్యంకర్‌పై విమర్శలు!
Supreme Court | రక్తసంబంధ వివాహాలపై చట్టం అవసరం.. కేంద్రానికి సుప్రీంకోర్టు సూచన
Bird Flu Vaccine | స్వదేశీ బర్డ్ ఫ్లూ టీకా వచ్చేసింది.. కోళ్లకు ఒక్కో డోసు ధర రూ.1 నుంచి రూ.2!
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

