హైదరాబాద్, నవంబర్ 30 (నమస్తే తెలంగాణ): ఉద్యోగాల సాధనకు నైపుణ్యాలు కీలకమని ఎస్సీ అభివృద్ధి శాఖ కమిషనర్, కార్పొరేషన్ ఎండీ క్షితిజ ఉద్బోధించారు. ఎస్సీ కార్పొరేషన్ ఆర్థిక సహకారంతో అనైత్య ఎడ్యుకేషనల్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత నైపుణ్య శిక్షణ ముగింపు కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు.
ఈ సందర్భంగా శిక్షణ పొందిన దళిత యువతీ యువకులకు సర్టిఫికెట్లతోపాటు జాబ్ ఆఫర్ లెటర్లను అందజేశారు. అనంతరం క్షితిజ మాట్లాడుతూ దళిత యువత కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఇస్తున్న ఉచిత శిక్షణ కార్యక్రమాలను సద్వినియోగం చేసుకొని, ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని పేర్కొన్నారు.