ముంబై, ఫిబ్రవరి 17: చిన్న స్థాయి పెట్టుబడిదారులను ఆకట్టుకోవాలనే ఉద్దేశంలో ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్..మరో సిస్టమెటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్(సిప్)ను అందుబాటులోకి తీసుకొచ్చింది. కేవలం రూ.250తో ఈ జన్నివేశ్ సిప్ స్కీంను సెబీ చైర్పర్సన్ మాధవి పూరి బచ్ సోమవారం ప్రారంభించారు. తొలిసారి మదుపు చేసేవారు, చిన్న మదుపర్లు, సెబీ అర్బన్‌లో ఉండే వారి లక్ష్యంగా ఈ సిప్‌ను ప్రారంభించినట్లు కంపెనీ ఎండీ, చీఫ్ ఎగ్జిక్యూటివ్ నంద కిశోర్ ఈ సందర్భంగా తెలిపారు. సాధారణంగా రూ.500తో సిప్ చేసే వెసులుబాటు ఉండగా, దీనిని మరింత మందికి చేరువచేసేలా దీనిని సగానికి సగం తగ్గించి రూ.250కే సిప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు చెప్పారు. రోజు, వారం, నెలవారీ మొత్తంలో ఈ సిప్ కింద మదుపు చేయవచ్చును.