e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Friday, July 30, 2021
Home News ఎస్బీఐ ‘ఆరోగ్య సుప్రీం’కు మంచి రెస్సాన్స్‌!

ఎస్బీఐ ‘ఆరోగ్య సుప్రీం’కు మంచి రెస్సాన్స్‌!

ఎస్బీఐ ‘ఆరోగ్య సుప్రీం’కు మంచి రెస్సాన్స్‌!

ముంబై: దేశంలోనే అతిపెద్ద ప్ర‌భుత్వ రంగ బ్యాంకు.. భార‌తీయ స్టేట్ బ్యాంక్ (ఎస్బీఐ) తాజాగా అందుబాటులోకి తెచ్చిన హెల్త్ ఇన్సూరెన్స్ పాల‌సీ ‘ఆరోగ్య సుప్రీం’ పాల‌సీకి మొదట్లోనే మంచి రెస్పాన్స్ ల‌భిస్తున్న‌ది. 20 బేసిక్​ కవరేజీలు, 8 ఆప్షనల్​ కవరేజీలతో సహా పూర్తి ఆరోగ్య బీమా కవరేజీని అందించేలా ఈ పాలసీని ఎస్బీఐ జ‌న‌ర‌ల్ ఇన్సూరెన్స్ రూపొందించింది.

ఎప్పటికప్పుడు ఎస్బీఐ ఖాతాదారుల సంక్షేమం కోసం కొత్త పథకాలను ప్రకటిస్తున్న సంగ‌తి తెలిసిందే. తాజాగా బ్యాంకింగ్ రంగ‌మే కాక‌, బీమా రంగంలోనూ ఖాతాదారుల‌ కోసం సరికొత్త స్కీమ్‌లను అందుబాటులోకి తెస్తున్న‌ది. ఈ క్రమంలోనే…. తాజాగా ​‘ఆరోగ్య సుప్రీం’ పాలసీని తీసుకొచ్చింది.

రూ.5 కోట్ల వ‌ర‌కు క‌వ‌రేజీ

- Advertisement -

​‘ఆరోగ్య సుప్రీం’ బీమా పాలసీ కింద పాల‌సీదారుకు రూ. 5 కోట్ల వరకు బీమా ఆప్షన్లు అందుబాటులో ఉంటాయి. వినియోగదారుడి అవసరాలు, కవరేజీ ఫీచర్ల‌​ ఆధారంగా ప్రో, ప్లస్, ప్రీమియం అనే మూడు ఆప్షన్లలో ఏదైనా ఒక దానిని ఎంచుకోవ‌చ్చు.

ఎస్బీఐ ‘ఆరోగ్య సుప్రీం’కు మంచి రెస్సాన్స్‌!

మూడేండ్ల వ‌ర‌కు ఎస్బీఐ ​‘ఆరోగ్య సుప్రీం’

సమ్ ఇన్సూర్డ్ రీఫిల్, రికవరీ బెనిఫిట్ వంటి కస్టమర్ ఫ్రెండ్లీ ఒప్పందాల్లో భాగంగా 1-3 ఏండ్ల‌ వరకు పాలసీ గ‌డువు నిర్ణ‌యించుకోవ‌చ్చు. కరోనా మహమ్మారి వ‌ల్ల‌ ఇన్సూరెన్స్‌ పాలసీలకు భారీగా డిమాండ్ పెరుగుతున్న‌ది. ఎస్బీఐ పలు బీమా పాలసీలను తీసుకొచ్చింది. ఈ సంద‌ర్భంగా ఎస్బీఐ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ ఎండీ & సీఈఓ పీసీ కాండ్‌పాల్ స్పందిస్తూ.. ‘ప్రస్తుత పరిస్థితుల్లో ఆరోగ్య బీమాకు ప్రాధాన్యం పెరిగింది’ అని చెప్పారు.

క‌రోనాతో బీమా ప్ర‌తి ఒక్క‌రికి అవ‌స‌రం

‘కరోనా వ‌ల్ల ప్రతి ఒక్కరికి బీమా అవసరం తెలిసి వచ్చింది. దీంతో చాలా మంది పాలసీలు చేసుకుంటున్నారు. ఈ నేపధ్యంలో… ఆరోగ్య సుప్రీం, సమగ్ర ఆరోగ్య బీమా పథకాలను ప్రారంభించాం. వినియోగదారులు వారి అవసరాలకు తగ్గట్లుగా ప్రీమియం, దాని మెచ్యూరిటీ కాలం ఎంచుకునే అవకాశం కల్పిస్తున్నాం’ అని వెల్లడించారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
ఎస్బీఐ ‘ఆరోగ్య సుప్రీం’కు మంచి రెస్సాన్స్‌!
ఎస్బీఐ ‘ఆరోగ్య సుప్రీం’కు మంచి రెస్సాన్స్‌!
ఎస్బీఐ ‘ఆరోగ్య సుప్రీం’కు మంచి రెస్సాన్స్‌!

ట్రెండింగ్‌

Advertisement