ముంబై, ఆగస్టు 8 : ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2025-26) తొలి త్రైమాసికం (ఏప్రిల్-జూన్)లో రూ.21,201 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని సాధించింది. గతంతో పోల్చితే ఇది 9.71 శాతం ఎక్కువని శుక్రవారం బ్యాంక్ ప్రకటించింది. ట్రెజరీ, ఫారెక్స్ ఆదాయాలు పెరగడమే ఇందుకు కారణంగా పేర్కొన్నది.
కాగా, స్టాండలోన్ నికర లాభం రూ.19,160 కోట్లుగా ఉన్నది. ఇదిలావుంటే తొలి త్రైమాసికంలో దేశంలోని 12 ప్రభుత్వ రంగ బ్యాంకుల లాభాలు కలిపితే రూ.44,218 కోట్లకు చేరాయి. నిరుడుతో చూస్తే ఇది 11 శాతం అధికం. ఇందులో ఒక్క ఎస్బీఐ వాటానే సగానికి చేరువగా ఉండటం విశేషం.