SBI New Card Pulse | ఎస్బీఐ తన కస్టమర్ల కోసం కొత్తగా క్రెడిట్ కార్డు ప్రారంభించింది. వీసా సిగ్నేచర్ ప్లాట్ఫామ్లో తీసుకొచ్చిన ఎస్బీఐ కార్డ్ పల్స్ అనే పేరుతో వస్తోంది. ఇది ఫిట్నెస్, ఆరోగ్య ప్రయోజనాలు అందిస్తున్న తొలి కార్డు. దీని వార్షిక సభ్యత్వ ఫీజు రూ.1,499. ఏడాదిలోపు రూ.2 లక్షలు ఖర్చు చేస్తే వార్షిక రెన్యూవల్ ఫీజు రద్దవుతుంది. ఈ కార్డు తీసుకున్న వారికి ఎస్బీఐ.. వెల్కం గిఫ్ట్‌గా నాయిస్ కలర్‌ఫిట్ పల్స్ స్మార్ట్ వాచ్ ఆఫర్ చేస్తున్నది. ఈ స్మార్ట్ వాచ్ 1.40 అంగుళాల ఫుల్ కలర్ డిస్ప్లేతో వస్తుంది. బ్లడ్, ఆక్సిజన్ మానిటర్ (ఎస్పీవో2), స్లీప్ మానిటరింగ్ వంటి పీచర్లు ఇందులో ఉన్నాయి.
ఫిట్‌పాస్ ప్రోలో ఏడాది కాంప్లిమెంటరీ సభ్యత్వం.. ఇది కల వారు దేశవ్యాప్తంగా 400కి పైగా జిమ్‌లు, ఫిట్నెస్ కేంద్రాల్లో చేరొచ్చు. ప్రతి నెలా 12 సెషన్స్‌లో పాల్గొనవచ్చు. ఫిట్‌కోచ్, ఫిట్ ఫీస్ట్ సభ్యత్వం, ఫిట్ పాస్ మొబైల్ అప్లికేషన్లో రోజువారీ పిట్నెస్ కోచింగ్, పౌష్టికాహార నిపుణులు అందుబాటులో ఉంటారు.
ఇంకా ఏడాది నెట్‌మెడ్స్ ఫస్ట్ సభ్యత్వం పొందుతారు. దీంతో ఏడాది పాటు ఆన్లైన్లో డాక్టర్‌ను ఎన్నిసార్లైనా సంప్రదించవచ్చు. ఏడాది పొడవునా సాధారణ హెల్త్ చెకప్‌లు ఉంటాయి. ప్రతి ప్రీపెయిడ్ ఆఫర్‌పై అదనంగా 2.5 శాతం (రూ.100) ఎన్ఎంఎస్ నగదు, పాథాలజీ లాబ్‌లో టెస్ట్‌లపై అదనంగా ఐదు శాతం తగ్గింపు తదితర ఫీచర్లు ఉన్నాయి.