హైదరాబాద్, జూన్ 24 : సంగీత మొబైల్స్ 51వ వసంతంలోకి అడుగుపెట్టింది. ఈ సందర్భంగా కొనుగోలుదారులపై ఆఫర్ల వర్షం కురిపించింది. దేశవ్యాప్తంగా కంపెనీకి ఉన్న రిటైల్ అవుట్లెట్లను సందర్శించిన ప్రతీ కస్టమర్‌కు రూ.5,001 చొప్పున ఎలక్ట్రానిక్ మనీని ట్రాన్స్ఫర్ చేయనున్నారు. కంపెనీ అవుట్లెట్లలో కొనుగోలు చేసే ప్రతీ వస్తువుపై 5 శాతం వరకు ఈ మనీని బదలాయించుకోవచ్చునని, దీనిని డిసెంబర్ 31 వరకు వినియోగించుకోవచ్చునని కంపెనీ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ సుభాష్ చంద్ర తెలిపారు.
ఈ నెల మొదట్లో ప్రారంభమైన ఈ ప్రత్యేక ఆఫర్లు వచ్చే నెల 6 వరకు కొనసాగనున్నాయని చెప్పారు. వీటితోపాటు టీవీలు, వాషింగ్మిషన్లు, వాక్యూమ్ కూలర్లపై 10 శాతం తగ్గింపు ధరకే అందిస్తున్నది. ప్రతీయేటా 10-15 శాతం వృద్ధిని సాధిస్తున్నట్టు, గడిచిన ఏడాది రూ.3 వేల కోట్లుగా నమోదైన టర్నోవర్, ఈ సారి రూ.3,500 కోట్లకు చేరుకుంటున్నదని ఆశిస్తున్నట్టు చెప్పారు.