Samsung Galaxy S23 FE | దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్ మేజర్ శాంసంగ్.. త్వరలో తన గెలాక్సీ ఎస్23 సిరీస్ ఫోన్లను మార్కెట్లో ఆవిష్కరించనున్నది. శాంసంగ్ గెలాక్సీ ఎస్23 ఎఫ్ఈ (Samsung Galaxy S23 FE) అనే పేరుతో వస్తున్నది. దీంతోపాటు గెలాక్సీ ఎస్23, గెలాక్సీ ఎస్23 ప్లస్, గెలాక్సీ ఎస్23 ఆల్ట్రా ఫోన్లు కూడా ఆవిష్కరిస్తారని తెలుస్తున్నది. 6.4 అంగుళాలతో 120 హెర్ట్జ్ అమోలెడ్ స్క్రీన్ డిస్ ప్లే కలిగి ఉంటుంది. శాంసంగ్ గెలాక్సీ ఎస్23 ఎఫ్ఈ (Samsung Galaxy S23 FE) ఆవిష్కరణ తప్పనిసరి జరుగుతుందని సంస్థ మొబైల్స్ డివిజన్ సౌతాఫ్రికా వైస్ ప్రెసిడెంట్ జస్టిన్ హుమ్ సంకేతాలిచ్చారు.
గెలాక్సీ ఎస్23 ఎఫ్ఈ ఫోన్ (Samsung Galaxy S23 FE) 4.4వాట్ల వైర్లెస్ చార్జింగ్ సపోర్ట్‌గా ఉంటుందని సమాచారం. యూఎస్బీ టైప్-సీ పోర్ట్ కనెక్టివిటీ కలిగి ఉంటుందని తెలుస్తున్నది. గెలాక్సీ ఎస్23 ఆల్ట్రా ఫోన్ 45 వాట్ల వైర్డ్ 15 వాట్ల వైర్లెస్ చార్జింగ్కు సపోర్ట్‌గా ఉండొచ్చునని భావిస్తున్నారు.
గెలాక్సీ ఎస్23 ఎఫ్ఈ ఫోన్.. అమెరికా, కెనడా మార్కెట్లలో క్వాల్కామ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 1 ఎస్వోసీ లేదా స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 ఎస్వోసీ చిప్ సెట్తోనూ.. ఇతర మార్కెట్లలో ఎక్స్‌నోస్ 2200 చిప్ సెట్‌తో వస్తుందని భావిస్తున్నారు.
శాంసంగ్ గెలాక్సీ ఎస్23 ఎఫ్ఈ (Samsung Galaxy S23 FE) ఫోన్ ఆండ్రాయిడ్-13 బేస్డ్ వన్ యూఐ వర్షన్ మీద పని చేస్తుందని చెబుతున్నారు. ఎక్స్‌క్లిప్స్ 930 ఏఎండీ జీపీయూతో కూడిన ఎక్స్ నోస్ ప్రాసెసర్ ఇస్తారని తెలుస్తున్నది. 8 జీబీ రామ్ విత్ 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్‌గా మార్కెట్లోకి వస్తున్నది.
గెలాక్సీ ఎస్23 ఎఫ్ఈ ఫోన్ ట్రిపుల్ రేర్ కెమెరా సెటప్ కలిగి ఉంటుంది. 50-మెగా పిక్సెల్ ప్రైమరీ సెన్సర్, 12-మెగా పిక్సెల్ సెన్సర్ విత్ ఆల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్, 8-మెగా పిక్సెల్ సెన్సర్ విత్ టెలిఫొటో లెన్స్ కెమెరా, సెల్ఫీలూ వీడియో కాల్స్ కోసం ఫ్రంట్‌లో 12-మెగా పిక్సెల్ సెన్సర్ కెమెరా ఉంటది. 4500 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీ అమరుస్తారని భావిస్తున్నారు.