Galaxy M17 5G | భారత మార్కెట్లోకి సరికొత్త బడ్జెట్ ఫోన్.. అధికారికంగా లాంచ్ చేసిన శాంసంగ్
Galaxy M17 5G | భారత స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి ప్రముఖ టెక్ దిగ్గజం శాంసంగ్ మరో కొత్త బడ్జెట్ 5జీ ఫోన్‌ను తీసుకొచ్చింది. తన M సిరీస్‌లో భాగంగా ‘గెలాక్సీ M17 5G’ మోడల్‌ను (ఇవాళ) శుక్రవారం అధికారికంగా లాంచ్ చేసింది. సామాన్యులకు సైతం అందుబాటు ధరలో ఈ ఫోన్ ఉంది. శక్తివంతమైన ఫీచర్లను అందిస్తోంది.
Galaxy M17 5G : భారత స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి ప్రముఖ టెక్ దిగ్గజం శాంసంగ్ మరో కొత్త బడ్జెట్ 5జీ ఫోన్‌ను తీసుకొచ్చింది. తన M సిరీస్‌లో భాగంగా ‘గెలాక్సీ M17 5G’ మోడల్‌ను (ఇవాళ) శుక్రవారం అధికారికంగా లాంచ్ చేసింది. సామాన్యులకు సైతం అందుబాటు ధరలో ఈ ఫోన్ ఉంది. శక్తివంతమైన ఫీచర్లను అందిస్తోంది. ముఖ్యంగా ఆరేళ్లపాటు సాఫ్ట్వేర్ అప్డేట్లు ఇస్తామని ప్రకటించడం ఈ ఫోన్ ప్రత్యేకతగా నిలుస్తున్నది.
యువతను, బడ్జెట్ వినియోగదారులను లక్ష్యంగా చేసుకుని ఈ కొత్త ఫోన్‌ను మూడు వేరియంట్లలో తీసుకొచ్చారు. బేస్ మోడల్ అయిన 4GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.12,499గా నిర్ణయించారు. అలాగే 6GB RAM + 128GB వేరియంట్ ధరను రూ.13,999 గా, 8GB RAM + 128GB టాప్ వేరియంట్ ధరను రూ.15,499 గా ప్రకటించారు.
ఈ స్మార్ట్‌ఫోన్ అమ్మకాలు ఈ నెల 13 నుంచి శాంసంగ్ ఇండియా వెబ్సైట్, అమెజాన్‌తో పాటు ప్రముఖ రిటైల్ స్టోర్లలో ప్రారంభమవుతాయి. మూన్లైట్ సిల్వర్, సఫైర్ బ్లాక్ రంగుల్లో ఈ ఫోన్ అందుబాటులో ఉంటుంది. గెలాక్సీ M17 5G ఫోన్లో 6.7 అంగుళాల ఫుల్ HD+ సూపర్ అమోలెడ్ డిస్ప్లేను అమర్చారు. దీనికి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్+ ప్రొటెక్షన్ ఉండటంవల్ల మన్నికగా ఉంటుంది.
శాంసంగ్ సొంత ప్రాసెసర్ అయిన ఎగ్జినోస్ 1330 చిప్సెట్తో ఇది పనిచేస్తుంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 15 ఆధారిత వన్ UI 7 ఆపరేటింగ్ సిస్టమ్‌తో వస్తుంది. ఫోటోగ్రఫీ కోసం వెనుకవైపు మూడు కెమెరాల సెటప్ ఇచ్చారు. ఇందులో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS) సపోర్ట్‌తో కూడిన 50 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా, 5 MP అల్ట్రావైడ్ లెన్స్, 2 MP కెమెరా ఉన్నాయి.
సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 13 మెగాపిక్సెల్ కెమెరాను అమర్చారు. మైక్రో SD కార్డు ద్వారా స్టోరేజ్‌ను పెంచుకునే సౌకర్యం కూడా ఈ ఫోన్లో ఉంది. ఈ సందర్భంగా శాంసంగ్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ కెన్నెత్ పై మాట్లాడుతూ.. ‘భారతీయ వినియోగదారుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని గెలాక్సీ M17 5Gని రూపొందించాం. దీర్ఘకాలిక సాఫ్ట్వేర్ అప్డేట్ల హామీతో ఈ ఫోన్‌పై పెట్టే పెట్టుబడికి పూర్తి విలువ లభిస్తుంది’ అని చెప్పారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
BRS AUSTRALIA | వెలుగు పత్రిక తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం : అనిల్ బైరెడ్డి
AP Muncipal Elections | ఈ నెల 28వ తేదీన ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలకు సెలవు!
Shakambari Devi | శాకాంబరీదేవిగా వేయిస్తంభాల రుద్రేశ్వరీదేవి దర్శనం
Harish Rao | రైతుకూలీల బిడ్డలు డాక్టర్లు కావడం గర్వకారణం : మాజీ మంత్రి హరీష్‌రావు
TGSRTC | పండుగ వేళ టికెట్ ఛార్జీల బాదుడు.. 2003 జీవో పేరుతో సమర్థించుకున్న టీజీఎస్ఆర్టీసీ!
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

