Samsung Galaxy F55 5G | దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్స్ దిగ్గజం శాంసంగ్ తన శాంసంగ్ గెలాక్సీ ఎఫ్55 5జీ ఫోన్‌ను సోమవారం భారత్ మార్కెట్లో ఆవిష్కరించింది. క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 7 జెన్ 1 ఎస్వోసీ చిప్ సెట్, 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీతో వస్తోంది. ఇన్-డిస్ ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్‌తోపాటు 50-మెగా పిక్సెల్స్ సెన్సర్ మెయిన్ కెమెరాతో కూడిన ట్రిపుల్ రేర్ కెమెరా సెటప్ ఉంటుంది. వేగాన్ లెదర్ ఫినిషెస్తోపాటు రెండు రంగుల ఆప్షన్లలో లభిస్తుంది. భారత్ మార్కెట్లో ఈ సెగ్మెంట్లో వస్తు్న్న తేలికైన సన్నని స్మార్ట్ ఫోన్ ఇదే.
శాంసంగ్ గెలాక్సీ ఎఫ్55 5జీ ఫోన్ 8జీబీ ర్యామ్ విత్ 128 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.26,999, 8జీబీ ర్యామ్ విత్ 256 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.29,999, 12 జీబీ ర్యామ్ విత్ 256 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.32,999లకు లభిస్తాయి. అప్రికాట్ క్రష్, రైజిన్ బ్లాక్ రంగుల్లో అందుబాటులో ఉంటుంది. ఫ్లిప్ కార్ట్ ద్వారా సోమవారం ఏడు గంటలకు ఎర్లీ సేల్స్ ప్రారంభం అవుతాయి.
శాంసంగ్ గెలాక్సీ ఎఫ్55 5జీ ఫోన్ 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేటుతోపాటు 6.55 అంగుళాల ఫుల్ హెచ్డీ+ (2400×1080 పిక్సెల్స్) సూపర్ అమోలెడ్ ప్లస్ డిస్ ప్లే కలిగి ఉంటుంది. క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 7 జెన్ 1 ఎస్వోసీ చిప్ సెట్ కలిగి ఉంటుంది. 12 జీబీ ర్యామ్ విత్ 256 జీబీ ఆన్ బోర్డు స్టోరేజీ కలిగి ఉంటుంది. మైక్రో ఎస్డీ కార్డు సాయంతో ఒక టిగా బైట్ వరకూ స్టోరేజీ కెపాసిటీ పెంచుకోవచ్చు.
శాంసంగ్ గెలాక్సీ ఎఫ్55 5జీ ఫోన్ ఆండ్రాయిడ్ 14 బేస్డ్ వన్ యూఐ 6.1 వర్షన్‌పై పని చేస్తుంది. నాలుగేండ్లు ఆండ్రాయిడ్ అప్ డేట్స్, ఐదేండ్లు సెక్యూరిటీ అప్ డేట్స్ అందిస్తుంది. 50-మెగా పిక్సెల్ మెయిన్ కెమెరా, 8-మెగా పిక్సెల్ ఆల్ట్రా వైడ్ కెమెరా, 2-మెగా పిక్సెల్ సెన్సర్ కెమెరాతోపాటు సెల్ఫీలూ వీడియో కాల్స్ కోసం 50-మెగా పిక్సెల్స్ సెన్సర్ కెమెరా ఉంటాయి.
శాంసంగ్ గెలాక్సీ ఎఫ్55 5జీ ఫోన్ 45వాట్ల వైర్డ్ ఫాస్ట్ చార్జింగ్ మద్దతుతో 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీ కలిగి ఉంటది. ఈ ఫోన్ 5జీ, 4జీ, వై-ఫై, జీపీఎస్, బైడూ, గెలీలియో,క్యూజడ్ఎస్ఎస్, ఎన్ఎఫ్సీ, యూఎస్బీ టైప్-సీ పోర్ట్ కనెక్టివిటీ కలిగి ఉంటుంది. సెక్యూరిటీ – బయో మెట్రిక్ అథంటికేషన్ కోసం ఇన్ డిస్ ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్, నాక్స్ సెక్యూరిటీ సాఫ్ట్ వేర్ ఉంటుంది.