Samsung Galaxy F15 5G | మార్చి 4న భారత్ మార్కెట్లోకి శాంసంగ్ గెలాక్సీ ఎఫ్15 5జీ.. ఇవీ స్పెషిఫికేషన్స్..!
Samsung Galaxy F15 5G | దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్స్ మేజర్ శాంసంగ్.. భారత్ మార్కెట్లో తన శాంసంగ్ గెలాక్సీ ఎఫ్15 5జీ ఫోన్‌ను వచ్చేనెల 4న ఆవిష్కరించనున్నది.
Samsung Galaxy F15 5G | దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్స్ మేజర్ శాంసంగ్ (Samsung).. భారత్ మార్కెట్లో తన శాంసంగ్ గెలాక్సీ ఎఫ్15 5జీ (Samsung Galaxy F15 5G) ఫోన్‌ను వచ్చేనెల 4న ఆవిష్కరించనున్నది. మీడియాటెక్ డైమెన్సిటీ 6100 + ఎస్వోసీ చిప్సెట్ (MediaTek Dimensity 6100+ SoC) ప్రాసెసర్‌తోపాటు మూడు రంగుల్లో అందుబాటులోకి వస్తుంది. శాంసంగ్ గెలాక్సీ ఎఫ్15 5జీ (Samsung Galaxy F15 5G) ఫోన్ యూఎస్బీ -సీ చార్జింగ్ పోర్ట్ ద్వారా 25వాట్ల ఫాస్ట్ చార్జింగ్ మద్దతుతో 6000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీతో వస్తుంది. నాలుగేండ్ల పాటు ఆండ్రాయిడ్, ఐదేండ్ల పాటు సెక్యూరిటీ అప్ డేట్స్ అందిస్తుంది. శాంసంగ్ గెలాక్సీ ఏ15 కంటే తక్కువ ధరకే శాంసంగ్ గెలాక్సీ ఎఫ్15 5జీ ఫోన్ లభిస్తుంది. ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ ఫ్లిప్ కార్ట్ ద్వారా విక్రయిస్తారు. యాష్ బ్లాక్, గ్రూవీ వయోలెట్, జాజీ గ్రీన్ కలర్స్ ఆప్షన్లలో లభిస్తుంది.
సూపర్ అమోలెడ్ డిస్ప్లే, ఒక్టాకోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 6100 + చిప్సెట్ ప్రాసెసర్‌తో వస్తున్న శాంసంగ్ ఎఫ్15 5జీ ఫోన్ సింగిల్ చార్జింగ్‌తో రెండు రోజుల బ్యాటరీ లైఫ్ కలిగి ఉంటుంది. శాంసంగ్ గెలాక్సీ ఎఫ్15 5జీ (Samsung Galaxy F15 5G) ఫోన్ 50-మెగా పిక్సెల్ ప్రైమరీ సెన్సర్ కెమెరాతో కూడిన ట్రిపుల్ రేర్ కెమెరా యూనిట్, సింగిల్ సెల్ఫీ షూటర్‌పై వాటర్ డ్రాప్‌స్టైల్ డిస్ప్లే కలిగి ఉంటుంది. కాల్స్ వచ్చినప్పుడు బ్యాక్ గ్రౌండ్ నాయిస్ తొలగించడానికి ‘వాయిస్ ఫోకస్’ అనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఫీచర్ వాడారు. దీని ధర రూ.15 వేల లోపు ఉంటుందని భావిస్తున్నారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

