Samsung Galaxy A25 & A15 | దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్ మేజర్ శాంసంగ్ తన న్యూ గెలాక్సీ ఏ-సిరీస్ స్మార్ట్ ఫోన్లు.. శాంసంగ్ గెలాక్సీ ఏ25 5జీ, శాంసంగ్ గెలాక్సీ ఏ15 5జీ, శాంసంగ్ గెలాక్సీ ఏ15 4జీ ఫోన్లను వియత్నాంలో ఆవిష్కరించింది. త్వరలో భారత్ మార్కెట్లోనూ ఆవిష్కరిస్తుందని సమాచారం. ఈ ఫోన్లు ఆండ్రాయిడ్ 14 బేస్డ్ వన్ యూఐ 6.0 వర్షన్‌పై పని చేస్తాయి. 25 వాట్ల వైర్డ్ చార్జింగ్ మద్దతుతో 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీలతో వస్తున్నాయి. అయితే చార్జర్ విడిగా విక్రయిస్తారు.
శాంసంగ్ గెలాక్సీ ఏ25 5జీ ఫోన్.. బ్లాక్, బ్లూ, లైట్ బ్లూ, ఎల్లో కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. దీని ధర సుమారు 22,500 ఉంటుందని తెలుస్తున్నది. గెలాక్సీ ఏ15 5జీ ఫోన్ రూ.21,500, గెలాక్సీ ఏ15 4జీ ఫోన్ రూ.17,100 పలుకుతుందని సమాచారం.
శాంసంగ్ గెలాక్సీ ఏ25 5జీ స్మార్ట్ ఫోన్ 6.5 అంగుళాల ఫుల్ హెచ్డీ+ సూపర్ అమోలెడ్ డిస్ ప్లే విత్ 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్, 1000 నిట్స్ పీక్ బ్రైట్ నెస్ కలిగి ఉంటుంది. గెలాక్సీ ఏ15 ఫోన్ 90 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్ విత్ 800 నిట్స్ పీక్ బ్రైట్నెస్ కలిగి ఉంటుంది. గెలాక్సీ ఏ25 5జీ ఫోన్ ఎక్స్ నోస్ 1280 ఎస్వోసీ చిప్ సెట్, గెలాక్సీ ఏ15 5జీ ఫోన్ మీడియా టెక్ డైమెన్సిటీ 6100+, గెలాక్సీ ఏ15 4జీ ఫోన్ మీడియాటెక్ హెలియో జీ99 చిప్ సెట్ కలిగి ఉంటాయి.
గెలాక్సీ ఏ15 5జీ, గెలాక్సీ ఏ15 4జీ పోన్లు 50-మెగా పిక్సెల్ ప్రైమరీ సెన్సర్, 5-మెగా పిక్సెల్ సెన్సర్ విత్ ఆల్డ్రావైడ్ యాంగిల్ లెన్స్, 2-మెగా పిక్సెల్ మాక్రో సెన్సర్ కెమెరా ఉంటాయి. ఇక గెలాక్సీ ఏ25 5జీ ఫోన్ 50-మెగా పిక్సెల్ ప్రైమరీ సెన్సర్ విత్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (ఓఐఎస్), 5-మెగా పిక్సెల్ సెన్సర్ విత్ ఆల్రా వైడ్ యాంగిల్ లెన్స్, 2-మెగా పిక్సెల్ మాక్రో సెన్సర్ కెమెరా ఉంటాయి. మూడు ఫోన్లలోనూ సెల్ఫీలూ వీడియో కాల్స్ కోసం 13-మెగా పిక్సెల్ సెన్సర్ కెమెరా ఉంటుంది.
గెలాక్సీ ఏ25 5జీ, గెలాక్సీ ఏ15 5జీ, గెలాక్సీ ఏ15 4జీ ఫోన్లలో 25 వాట్ల ఫాస్ట్ చార్జింగ్ మద్దతుతో 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీ ఉంటుంది. మూడింటిలోనూ సెక్యూరిటీ కోసం సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ ఉంటాయి.