Samsung Galaxy A05s | దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్స్ మేజర్ శాంసంగ్.. భారత్ మార్కెట్లోకి తన శాంసంగ్ గెలాక్సీ ఏ05ఎస్ (Samsung Galaxy A05s) ఫోన్ ఆవిష్కరించింది. ఈ ఫోన్ 6.7-అంగుళాల ఫుల్ హెచ్డీ + ఎల్సీడీ స్క్రీన్, క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 680 చిప్, 6 జీబీ ర్యామ్ విత్ 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజీతో వచ్చింది. 4జీ కనెక్టివిటీ గల ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఔటాఫ్ బాక్స్ వర్షన్‌పై పని చేస్తుంది. 50-మెగా పిక్సెల్ ప్రైమరీ సెన్సర్ కెమెరాతోపాటు ట్రిపుల్ రేర్ కెమెరా సెటప్ కలిగి ఉంటుంది. 25 వాట్ల చార్జింగ్ మద్దతుతో 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీ ఉంటుంది.
శాంసంగ్ గెలాక్సీ ఏ05ఎస్ (Samsung Galaxy A05s) ఫోన్ ధర రూ.17,499 పలుకుతుంది. కంపెనీ వైబ్సైట్లో అన్ని డిస్కౌంట్లతోపాటు రూ.14,999లకే లభిస్తుంది. బ్లాక్ టైల్ గ్రీన్, లైట్ వయోలెట్ కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది. ఎస్బీఐ క్రెడిట్ కార్డు ప్లస్ ఈఎంఐ లావాదేవీలపై రూ.1000 ఇన్స్టంట్ డిస్కౌంట్ అందిస్తున్నది.
శాంసంగ్ గెలాక్సీ ఏ05ఎస్ (Samsung Galaxy A05s) ఫోన్ శాంసంగ్ వన్ యూఐ 5.1 ఇంటర్ ఫేస్ తోపాటు ఆండ్రాయిడ్ 13 ఔటాఫ్ బాక్స్ వర్షన్ పై పని చేస్తుంది. ఒక్టాకోర్ స్నాప్ డ్రాగన్ 680 ఎస్వోసీ చిప్ సెట్ కలిగి ఉంటుంది. 50-మెగా పిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా విత్ ఎఫ్ /1.8 అపెర్చర్, 2-మెగా పిక్సెల్ మాక్రో కెమెరా విత్ ఎఫ్ /2.4 అపెర్చర్, 2-మెగా పిక్సెల్ డెప్త్ కెమెరా విత్ ఎఫ్/2.4 అపెర్చర్, సెల్ఫీలూ వీడియో కాల్స్ కోసం 13-మెగా పిక్సెల్స్ సెల్ఫీ కెమెరా ఉంటుంది. ఈ ఫోన్ లో మైక్రో ఎస్డీ కార్డు సాయంతో ఒక టిగా బైట్ వరకూ స్టోరేజీ కెపాసిటీ పెంచుకోవచ్చు.
4జీ ఎల్టీఈ, డ్యుయల్ బాండ్ వై-ఫై, బ్లూటూత్ 5.1, జీపీఎస్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్ కనెక్టివిటీ కలిగి ఉంటుంది. బయో మెట్రిక్ అథంటికేషన్ కోసం ఫింగర్ ప్రింట్ సెన్సర్ ఉంటుంది. వీటితోపాటు యాస్సెలో మీటర్, లైట్ సెన్సర్, ప్రాగ్జిమిటి సెన్సర్ ఉంటాయి.