Homes Registration | సొంతింటికే సై అంటున్న హైదరాబాదీలు.. పెరిగిన డిమాండ్
Homes Registration | కరోనా పుణ్యమా అని హైదరాబాద్ చుట్టుపక్కల ఏడాదిలో ఇండ్ల కొనుగోళ్లు 16 శాతం పెరిగాయి.

Homes Registration | సొంతిల్లు కావాలని మనలో ప్రతి ఒక్కరికీ ఉంటుంది. కరోనా మహమ్మారి తర్వాత ఆ ఆకాంక్షలు ఎక్కువయ్యాయి. సాధారణంగా మనవాళ్లు.. ప్రత్యేకించి హైదరాబాదీలు తమకు నచ్చిన ఇల్లు దొరికినా ప్రథమార్థంలో కొనుగోలు చేయడానికి.. అంటే రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి మొగ్గు చూపుతారు. సొంతిల్లు జీవిత కాల స్వప్నం.. కనుక శుభ ముహూర్తాలు ఎక్కువగా ఉన్నప్పుడే ఇండ్ల కొనుగోలుకే ప్రాధాన్యం ఇస్తారు. కానీ 2020తో పోలిస్తే ఈ ఏడాది జనవరి-నవంబర్ మధ్య హైదరాబాద్ చుట్టుపక్కల మూడు జిల్లాల (హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి) పరిధిలో ఇండ్ల కొనుగోళ్లు (రిజిస్ట్రేషన్) 16 శాతం పెరిగాయి. జనవరి నుంచి నవంబర్ వరకు 21,988 ఇండ్ల రిజిస్ట్రేషన్లు జరిగాయి. మొత్తం సేల్స్‌లో జనవరి-మార్చి మధ్య 41 శాతం ఇండ్లను వాటి కొనుగోలుదారులు రిజిస్టర్ చేసుకున్నారు. సెప్టెంబర్-నవంబర్ మధ్య 16 శాతం రిజిస్ట్రేషన్లు జరిగాయి.
సెప్టెంబర్-నవంబర్‌లో సంప్రదాయంగా స్లో
సంప్రదాయంగా సెప్టెంబర్-నవంబర్ మధ్య ఇండ్ల సేల్స్ నెమ్మదిగా సాగుతాయి. కానీ ఈ ఏడాది మాత్రం సగటు కంటే ఎక్కువగా ఇండ్ల రిజిస్ట్రేషన్లు జరిగాయి. ఇండ్ల ప్రాజెక్ట్ సైట్ల గురించి ఎంక్వైరీలు కూడా పెరగడంతో హైదరాబాద్ మార్కెట్లో ఇండ్లను కొనుగోలు చేసే వారిలో ఆసక్తి పెరుగుతున్నదని రియాల్టీ కన్సల్టెన్సీ ఏజెన్సీ నైట్‌ఫ్రాంక్ అభిప్రాయ పడింది.
రూ.50 లక్షల్లోపు ఇండ్ల రిజిస్ట్రేషన్లు 66%
2020లో జనవరి-నవంబర్ మధ్య రూ.50 లక్షల్లోపు విలువ గల ఇండ్ల రిజిస్ట్రేషన్లు 66% పూర్తయ్యాయి. రూ.25-50 లక్షల్లోపు విలువ గల ఇండ్లు 2020లో 31 శాతం జరిగితే ఈ ఏడాది 34 శాతానికి పెరిగాయి. 2020లో రూ.25 లక్షల్లోపు ఇండ్ల సేల్స్ 35 శాతమైతే, ఈ ఏడాది 32 శాతానికి పడిపోయాయి. 2020లో కరోనా మహమ్మారి వల్ల ఇండ్ల ధరలు స్థిరంగా కొనసాగినా, 2021లో క్రమంగా పెరిగాయి. గత తొమ్మిది నెలల్లో ఇండ్ల ధరలు సగటున 5.8 శాతం పెరిగాయి.
హైదరాబాద్‌లో 58 శాతం సేల్స్
హైదరాబాద్-రంగారెడ్డి-సంగారెడ్డి జిల్లాల పరిధిలో 16 శాతం ఇండ్ల విక్రయాలు పెరిగితే, హైదరాబాద్ జిల్లాలోనే 58 శాతం ఎక్కువగా ఉండటం ఆసక్తికర పరిణామం. 2020 జనవరి-నవంబర్ మధ్య హైదరాబాద్‌లో 29 శాతం సేల్స్ నమోదైతే ఈ ఏడాది అది 45 శాతం ఉన్నాయి. ఇండ్ల ధరలు కూడా 16.9 శాతం పెరిగాయి.
ఆకర్షణీయ మార్కెట్‌గా హైదరాబాద్
హోం బయ్యర్ మార్కెట్లో హైదరాబాద్ అత్యంత ఆకర్షణీయంగా కొనసాగుతున్నదని నైట్ ఫ్రాంక్ ఇండియా చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ శిశిర్ బైజాల్ చెప్పారు. సొంతిండ్ల కొనుగోలుదారుల డిమాండ్ స్థిరంగా కొనసాగుతున్నది. మహారాష్ట్ర, కర్ణాటక, పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వాల మాదిరిగా స్టాంప్ డ్యూటీలో కోత విధించకున్నా హైదరాబాద్‌లో సొంతిండ్ల డిమాండ్ యథాతథంగా కొనసాగుతున్నదని తెలిపారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
Vicky katrina Wedding Updates | విక్కీకౌశల్-కత్రినా వెడ్డింగ్ అప్డేట్స్
Daniel sekhar meets Kurien | ‘కురియన్’ను కలిసిన ‘డానియల్ శేఖర్’..ఇంతకీ ఇక్కడో తెలుసా..?
Naa Kosam Lyrical Video | సిద్ శ్రీరామ్ మరో మ్యాజిక్..బంగార్రాజు నుంచి ‘నా కోసం’ వీడియో సాంగ్
Mangli Kollywood debut | రూటు మార్చిన సింగర్ మంగ్లీ..!
Read Today's Latest Business News in Telugu and Telugu News
- Tags
- home sales
- Hyderabad
RELATED ARTICLES
తాజా వార్తలు
Hyderabad | రాజేంద్రనగర్‌లో మారణాయుధాల కలకలం.. రూ.4లక్షల విలువ చేసే గంజాయి, పిస్టోళ్లు స్వాధీనం
Jalamandali | హైదరాబాద్‌లో నీటి కటకట.. సొంత ఎస్టీపీల నీళ్లు వదిలేసి.. ప్రైవేట్ నీటిని కొంటామంటున్న జలమండలి!
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో శివ్ త్యాగం.. గోట్ ఆఫ్ స్పీడ్‌గా నిలిచిన త్రిగుణ్
Medigadda | నేడు మేడిగడ్డకు బీఆర్ఎస్ బృందం.. బరాజ్‌ను పరిశీలించనున్న హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలు
DK Shivakumar | ‘మెటా గ్లాసెస్’తో నాపై స్టింగ్ ఆపరేషన్‌కు యత్నం.. పారిశ్రామికవేత్తతో భేటీపై డీకే అనుమానం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

