విస్తరణ బాటలో కళామందిర్
చీరల విక్రయంలో అగ్రగామి సంస్థల్లో ఒకటైన సాయి సిల్క్స్ (కళామందిర్) లిమిటెడ్..స్టాక్ మార్కెట్లోకి లిస్ట్ కాబోతున్నది. ఇప్పటికే ఈ పబ్లిక్ ఇష్యూకి స్టాక్ మార్కెట్ నియంత్రణ మండలి సెబీ కూడా అనుమతినిచ్చింది.
హైదరాబాద్, డిసెంబర్ 17: చీరల విక్రయంలో అగ్రగామి సంస్థల్లో ఒకటైన సాయి సిల్క్స్ (కళామందిర్) లిమిటెడ్..స్టాక్ మార్కెట్లోకి లిస్ట్ కాబోతున్నది. ఇప్పటికే ఈ పబ్లిక్ ఇష్యూకి స్టాక్ మార్కెట్ నియంత్రణ మండలి సెబీ కూడా అనుమతినిచ్చింది. కళామందిర్, మందిర్, కేఎల్ఎం ఫ్యాషన్స్, వరమహాలక్ష్మి సిల్క్స్ పేర్లతో దక్షిణ భారతంలో రిటైల్ అవుట్లెట్లను నిర్వహిస్తున్నది సంస్థ. ఈ సందర్భంగా కంపెనీ ఫౌండర్, మేనేజింగ్ డైరెక్టర్ ప్రసాద్ చలవాది నమస్తే తెలంగాణతో ప్రత్యేకంగా మాట్లాడుతూ…
ఐపీవో సైజు ఎంత?
ఈ పబ్లిక్ ఇష్యూ ద్వారా రూ.1,200 కోట్ల వరకు నిధులు సమీకరించాలనుకుంటున్నాం. అందులో రూ.600 కోట్లు కొత్తగా షేర్లు జారీ చేయడం ద్వారా, ఇది కాకుండా మరో 1.80 కోట్ల షేర్లను ఆఫర్ ఫర్ సేల్ రూట్లో ప్రమోటర్ల వాటాను విక్రయించనున్నాం. ఇందుకు సంబంధించి ఈ ఏడాది జూలైలోనే సెబీకి డ్రాఫ్ట్ రెడ్ హెర్రింగ్ ప్రాస్పెక్టస్ దాఖలు చేయడం జరిగింది. ఈ పబ్లిక్ ఇష్యూ ద్వారా సేకరించనున్న నిధులను కొత్త స్టోర్లను ప్రారంభించడానికి, గోదాంలను ఏర్పాటు చేయడానికి వినియోగించనున్నారు. ప్రస్తుతం సంస్థలో ప్రమోటర్ల వాటా 95.24 శాతంగా ఉన్నది.
ఐపీవోకి రావడం ఎలా అనిపిస్తున్నది?
చాలా గర్వంగా ఉన్నది. చీరల విక్రయ రంగంలోకి అడుగు పెట్టిన 17 ఏండ్లలోనే స్టాక్ మార్కెట్లోకి అడుగుపెడుతుండటం చాలా సంతోషంగా ఉన్నది. ప్రస్తుతం చాలా సంస్థలు ఈ రంగంలో ఉన్నప్పటికీ ఏ సంస్థ కూడా ఐపీవోకి రాలేదు.
ఎన్ని స్టోర్లు ఏర్పాటు చేయబోతున్నారు?
ఐపీవో ద్వారా సేకరించిన నిధులతో కొత్తగా 25 స్టోర్లను ఏర్పాటు చేయాలనుకుంటున్నాం. దీంతోపాటు రెండు గిడ్డంగులు, ఇతర వ్యాపార విస్తరణకోసం ఈ నిధులను ఖర్చు చేయాలనుకుంటున్నాం. ప్రస్తుతం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు రాష్ర్టాల్లో 50 స్టోర్లను ఏర్పాటు చేసినట్లు, కొత్తగా ఏర్పాటు చేసేవాటిలో తమిళనాడుకు అధిక ప్రాధాన్యతనివ్వనున్నాం.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

