ముంబై, జనవరి 30 : డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ శుక్రవారం స్వల్పంగా కోలుకున్నది. అయితే ట్రేడింగ్ మధ్యలో మునుపెన్నడూ లేనిస్థాయికి పతనమైంది. తొలిసారి 92.02ను తాకింది. అమెరికా కరెన్సీ బలపడటం, భౌగోళిక-రాజకీయ అనిశ్చిత స్థితి నడుమ దేశీయ కరెన్సీ సెల్లింగ్ ప్రెషర్‌కు లోనైంది.
కాగా, ఉదయం ఆరంభంలో 91.89 వద్ద మొదలైన రూపీ ట్రేడింగ్.. ఒక దశలో 91.82కు బలపడింది. చివరకు 6 పైసలు కోలుకుని 91.93 వద్ద స్థిరపడింది. గురువారం ఆల్‌టైమ్ కనిష్ఠ స్థాయిలో 91.99 వద్ద ముగిసిన విషయం తెలిసిందే.