తగ్గిన రూపాయి విలువ
గతవారం కాస్త బలపడిన రూపాయి మారకపు విలువ ఈ వారం ప్రారంభ ట్రేడింగ్ రోజైన మంగళవారం మళ్లీ దిగువబాట పట్టింది. ఇంటర్‌బ్యాంక్ ఫారిన్ ఎక్సేంజ్ (ఫారెక్స్)లో 83.06-83.17 మధ్య హెచ్చుతగ్గులకు లోనైన రూపాయి చివరకు క్రితం ట్రేడింగ్ రోజుతో పోలిస్తే 8 పైసలు నష్టపోయి 83.15 వద్ద ముగిసింది.
ముంబై, జనవరి 23: గతవారం కాస్త బలపడిన రూపాయి మారకపు విలువ ఈ వారం ప్రారంభ ట్రేడింగ్ రోజైన మంగళవారం మళ్లీ దిగువబాట పట్టింది. ఇంటర్‌బ్యాంక్ ఫారిన్ ఎక్సేంజ్ (ఫారెక్స్)లో 83.06-83.17 మధ్య హెచ్చుతగ్గులకు లోనైన రూపాయి చివరకు క్రితం ట్రేడింగ్ రోజుతో పోలిస్తే 8 పైసలు నష్టపోయి 83.15 వద్ద ముగిసింది. శుక్రవారం ఇది 83.07 వద్ద ముగియగా, సోమవారం కరెన్సీ మార్కెట్‌కు సెలవు. దేశీయ స్టాక్ మార్కెట్లో నెగిటివ్ ట్రెండ్ నెలకొనడం, ముడి చమురు ధర పెరగడం రూపాయి తగ్గుదలకు కారణమని ఫారెక్స్ ట్రేడర్లు తెలిపారు.
డాలర్ ఇండెక్స్ 103.22 వద్దకు చేరగా, ప్రపంచ మార్కెట్లో బ్యారల్ క్రూడాయిల్ ధర 79 డాలర్ల స్థాయిని దాటింది. బీఎస్ఈ సెన్సెక్స్ అనూహ్యంగా 1,000 పాయింట్లకుపైగా నష్టపోయింది. విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల (ఎఫ్‌పీఐలు) వరుస విక్రయాలు సైతం రూపాయిని బలహీనపర్చిందని ట్రేడర్లు చెప్పారు. మంగళవారం స్టాక్ మార్కెట్ నుంచి ఎఫ్‌పీఐలు రూ.3,115 కోట్లు వెనక్కు తీసుకున్నట్టు స్టాక్ ఎక్సేంజీల ప్రాథమిక గణాంకాలు వెల్లడిస్తున్నాయి.
Read Today's Latest Business News in Telugu and Telugu News
- Tags
- Rupee
- Rupee falls
- U.S. Dollar
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

