Rules Change | ఈ ఆర్థిక సంవత్సరంలో మరో నెల గడిచిపోయింది. రేపటి నుంచి సెప్టెంబర్ మాసం మొదలుకానున్నది. సెప్టెంబర్ నుంచి పలు రూల్స్ మారనున్నాయి. మారనున్న నిబంధనలు రోజువారీ జీవితంపై ప్రత్యక్ష ప్రభావం చూపనున్నాయి. సెప్టెంబర్ నెలలో ఆదాయపు పన్ను రిటర్న్‌లు, యూపీఎస్, క్రెడిట్ కార్డులకు సంబంధించిన నియమాలను మారనున్నాయి. అలాగే, ఎల్పీజీ ధరలు సైతం మారే సూచనలున్నాయి. రేపటి నుంచి కొత్తగా మారనున్న రూల్స్ ఏంటో తెలుసుకుందాం రండి..!
ఐటీఆర్ దాఖలు చేసేందుకు చివరి తేదీ జులై 30 కాగా.. ఆదాయపు పన్నుశాఖ సెప్టెంబర్ వరకు పొడిగించింది. తప్పనిసరిగా సెప్టెంబర్ 15 లోపు ఐటీఆర్ దాఖలు చేయాల్సి ఉంటుంది. లేకపోతే నోటీసులు జారీ చేసే అవకాశం ఉంది.
యూపీఎస్ఎన్పీఎస్ అంటే నేషనల్ పెన్షన్ సిస్టమ్ కిందకు వచ్చే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు సెప్టెంబర్ 30లోగా ఏకీకృత పెన్షన్ స్కీమ్‌ను ఎంచుకోవాల్సి ఉంటుంది. గతంలో జూన్ 30 వరకు గడువు ఉండగా.. సెప్టెంబర్ 30 వరకు గడువు పొడిగించారు.
ప్రభుత్వరంగ బ్యాంక్ ఎస్బీఐ ఎంపిక చేసిన క్రెడిట్ కార్డుల రూల్స్‌ను మార్పులు చేసింది. సెప్టెంబర్ ఒకటి నుంచి ఈ మార్పులు అమలులోకి రానున్నాయి. రూల్స్ ప్రకారం కొన్ని కార్డుల రివార్డ్ పాయింట్ల నిబంధనలను సవరించింది. ఇకపై డిజిటల్ గేమింగ్, ప్రభుత్వ వెబ్సైట్లలో లావాదేవీలపై రివార్డ్ పాయింట్ల పొందలేరు.
సెప్టెంబర్ ఒకటి నుంచి ఎల్పీజీ గ్యాస్ ధరల్లో మార్పులు చేసే అవకాశం ఉంది. ప్రతినెలా ఒకటో తేదీన చమురు కంపెనీలు ఎల్పీజీ ధరలను సవరించే విషయం తెలిసిందే. ఈ క్రమంలో రేపు ఎల్పీజీ ధరలు మారే అవకాశం ఉంది. అలాగే, సీఎన్జీ, పీఎన్జీ, జెట్ ఇంధన ధరల్లో కూడా మార్పులు ఉండే అవకాశం ఉంది. చమురు కంపెనీలు ధరలు పెంచడం, తగ్గించడం లేదకపోతే యథావిధిగా కొనసాగించే అవకాశం ఉంటుంది.