Bullet 350 | దేశంలోనే పేరొందిన టూ వీలర్స్ తయారీ సంస్థ రాయల్ ఎన్ఫీల్డ్ (Royal Enfield) తన న్యూ బుల్లెట్ 350 (Bullet 350) బైక్ మార్కెట్లోకి తెస్తోంది. శుక్రవారం బుల్లెట్ 350 బైక్ ఆవిష్కరిస్తారు. ఇప్పటికే 350సీసీ కేటగిరీలో మార్కెట్లో ఉన్న హంటర్ 350, క్లాసిక్ 350 మోటారు సైకిళ్లలోని ఫీచర్లతోపాటు కొన్ని మార్పులతో బుల్లెట్-350 బైక్ తెస్తున్నది. ఈ బైక్‌లో జే-సిరీస్ 350సీసీ ఇంజిన్ అమరుస్తారని సమాచారం. 5-స్పీడ్ గేర్ బాక్స్‌తో వస్తున్న ఈ బైక్ ధర రూ.1.5 లక్షలు ఉండొచ్చునని భావిస్తున్నారు. బేస్, మిడ్, టాప్ వేరియంట్లలో న్యూ బైక్ వస్తుందని తెలుస్తున్నది.
350సీసీ లాంగ్ స్ట్రోక్ ఇంజిన్ గరిష్టంగా 6100 ఆర్పీఎం వద్ద 20.2 బీహెచ్పీ విద్యుత్, 4000 ఆర్పీఎం వద్ద 27 ఎన్ఎం టార్చి వెలువరిస్తుంది. న్యూ స్విచ్ గేర్, అడ్వాన్స్డ్ ఇన్స్ట్రుమెంట్ కన్సోల్, యూఎస్బీ పోర్ట్ వంటి ఫీచర్లు ఉంటాయని భావిస్తున్నారు.
ఇదిలా ఉంటే కంపెనీ వైబ్సైట్లో బుల్లెట్ 500, బుల్లెట్ ఎలెక్ట్రా, బుల్లెట్ సిక్స్టీ 5 వంటి బైక్‌ల గురించి ప్రస్తావన రావడంతో అందరి ద్రుష్టి వాటిపైనే పడుతున్నది. 2020లో బీఎస్-6 ప్రమాణాలు అమల్లోకి వచ్చిన తర్వాత బుల్లెట్ -500 బైక్.. భారత్ మార్కెట్ నుంచి ఉపసంహరించిన రాయల్ ఎన్ఫీల్డ్ అంతర్జాతీయ మార్కెట్లో మాత్రం విక్రయిస్తోంది.
సరిగ్గా 20 ఏండ్ల క్రితం బుల్లెట్ సిక్స్టీ 5 బైక్ మార్కెట్లోకి తెచ్చింది. బుల్లెట్ బైక్‌ల పట్ల ఆసక్తి పెరుగుతుండటంతో రాయల్ ఎన్ఫీల్డ్.. జే-సిరీస్ ఇంజిన్లతో ఎలెక్ట్రాతోపాటు బుల్లెట్ 500, బుల్లెట్ సిక్స్టీ5 బైక్ లను పునరుద్ధరిస్తుందని భావిస్తున్నారు.