Royal Enfield | భారత్‌కు చెందిన ప్రముఖ ద్విచక్ర వాహనాల కంపెనీ రాయల్ ఎన్ఫీల్డ్ స్క్రామ్ 440 మోడల్ బైక్ అమ్మకాలను నిలిపివేసింది. ఐదు నెలల కింద లాంచ్ చేసిన ఈ బైక్ ఇంజిన్‌లో సాంకేతిక లోపాలు తలెత్తాయని.. అందుకే విక్రయాలను తాత్కాలికంగా నిలిపివేసినట్లు సమాచారం. ఈ పరిణామంతో ఈ మోడల్ బైక్‌ని కొనుగోలు చేసిన వాహనదారులు ఆందోలనకు గురవుతున్నారు. రాయల్ ఎన్ఫీల్డ్ స్క్రామ్ 440 మోడల్ బైక్‌ని రూ.2.08లక్షలకు (ఎక్స్‌షోరూం) ధరతో మార్కెట్లోకి లాంచ్ చేసింది.
మార్కెట్లో ఈ బైక్‌కు మంచి ఆదరణ లభిస్తున్నది. తాజాగా ఈ బైక్‌లో ఇంజిన్ కీలక భాగంలో సాంకేతిక సమస్య తలెత్తినట్లు తెలుస్తున్నది. స్క్రామ్ 440 ఇంజిన్‌లోని మాగ్నెటిక్ కాయిల్లో అమర్చే ‘వుడ్రఫ్ కీ’ భాగంలో లోపాన్ని గుర్తించింది. దీని కారణంగా బైక్ కొంత దూరం వెళ్లాక ఆపిన సమయంలో తిరిగి స్టార్ కావడం లేదంటూ పలువురు ఫిర్యాదు చేశారు.
ఇంజిన్ నడుస్తున్న సమయంలో మధ్యలో ఆగిపోవడం వంటి సమస్యలు ఏం లేవని.. కేవలం ఒకసారి ఇగ్నిషన్ స్విచ్ ఆఫ్ చేశాక తిరిగి ఇంజిన్ ప్రారంభం కాకపోవచ్చని సమాచారం. దీన్ని గ్రహించిన కంపెనీ స్క్రామ్ 440 అమ్మకాలు, బుకింగ్స్, డెలివరీలను తాత్కాలికంగా నిలిపివేసింది. ఇప్పటికే విక్రయించిన బైక్‌లో సమస్య తలెత్తిన, లోపాలు లేని బైక్‌లకు సైతం వుడ్రఫ్ కీలను పంపే ప్రక్రియను కంపెనీ ప్రారంభించిందని సంబంధిత వర్గాలు తెలిపాయి. వాటిని సర్వీస్ సెంటర్ల ద్వారా బైక్‌లకు ఉచితంగానే అమర్చనున్నట్లు కంపెనీ వర్గాలు చెప్పాయి.
ఇప్పటి వరకు కంపెనీ ఉత్పత్తి చేసిన స్క్రామ్ 440 మోడల్లో కేవలం రెండుశాతం బైక్‌లలో మాత్రమే ఈ సమస్య ఉన్నట్లు అంచనా. వినియోగదారుల భద్రత, రైడింగ్ అనుభవానికి ప్రాధాన్యం ఇస్తూ కంపెనీ ఈ నిర్ణయం తీసుకుందని సంబంధిత వర్గాలు తెలిపారు. మళ్లీ బైక్‌ల బుకింగ్, డెలివరీ ఎప్పుడు పునః ప్రారంభిస్తుందనేది కంపెనీ ప్రకటించలేదు. కంపెనీ సమస్య ఉన్న బైక్‌లను సరి చేసిన తర్వాతనే ప్రారంభించే అవకాశం ఉన్నట్లు తెలుస్తున్నది. అయితే, దీనిపై కంపెనీ అధికారికంగా స్పందించలేదు.