Royal Enfield Hunter 350 | ఎన్ఫీల్డ్ అంటే యమ క్రేజీ.. ఏడాదిలోపే రికార్డుల జోరు..!
Royal Enfield Hunter 350 |రాయల్ ఎన్ఫీల్డ్ హంటర్-350 బైక్ లుక్కే డిఫరెంట్.. ఎన్ ఫీల్డ్ బైక్స్‌లో తక్కువ ధరకే లభిస్తున్న హంటర్-350 ఫిబ్రవరిలో లక్ష యూనిట్లు.. మరో ఐదు నెలల్లో రెండు లక్షల యూనిట్ల సేల్స్ రికార్డుకు చేరువలో ఉంది.
Royal Enfield Hunter 350 | రాయల్ ఎన్ఫీల్డ్ (Royal Enfield) మోటార్ సైకిల్స్ అంటే కుర్రకారుకే కాదు.. పాత తరం వారికీ మోజు.. ఆ బైక్‌పై వెళుతున్న వారిని అందరూ ఆకర్షిస్తారు. గతేడాది ఆగస్టులో మార్కెట్లోకి మిడ్ సైజ్ సెగ్మెంట్లో హంటర్350 (Hunter 350) బైక్ ఆవిష్కరించింది రాయల్ ఎన్ఫీల్డ్ (Royal Enfield). కేవలం మార్కెట్లోకి వచ్చిన ఏడు నెలల్లో అంటే ఫిబ్రవరి నాటికి లక్ష బైక్స్ అమ్ముడు పోయాయి. వచ్చే ఐదు నెలల్లో మరో లక్ష బైక్స్ అమ్ముడు కానున్నాయి. హంటర్-350 బైక్ ధర రూ.1.30 లక్షల (ఎక్స్ షోరూమ్) నుంచి రూ.1.45 లక్షల (ఎక్స్ షోరూమ్)కు లభిస్తుంది.
రాయల్ ఎన్ఫీల్డ్ (Royal Enfield) మోటారు సైకిళ్లలో తాజాగా మార్కెట్లోకి వచ్చిన హంటర్-350 అత్యంత చౌకగా అందుబాటులో ఉన్న కంపాక్ట్ మోటార్ సైకిల్. 17 అంగుళాల – అల్లాయ్ వీల్స్ కల ఈ బైక్ హ్యాండిల్స్, డైరెక్షన్ మార్పులు డిఫరెంట్. హంటర్-350తోపాటు మార్కెట్లోకి వచ్చిన క్లాసిక్-350, మీటర్-350 బైక్స్‌లోనూ 349సీసీ ఇంజిన్ ఉంది. కానీ హంటర్-350 బైక్ పట్ల చాలా మంది ఆసక్తిగా ఉన్నారు.
ప్రస్తుతం భారత్‌తోపాటు ఇండోనేషియా, జపాన్, దక్షిణ కొరియా, థాయిలాండ్, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, బ్రిటన్, అర్జెంటీనా, కొలంబియా వంటి దేశాల్లో హంటర్-350 బైక్స్ సేల్ అవుతున్నాయి. మెక్సికో, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ల్లోనూ విక్రయిస్తున్న రాయల్ ఎన్ఫీల్డ్ హంటర్-350 బైక్.. త్వరలో బ్రెజిల్ లో ఆవిష్కరిస్తారు.
గత ఏడాది కాలంలో మిడ్ సైజ్ మోటారు సైకిళ్ల సెగ్మెంట్’లో హంటర్-350 బైక్ అత్యంత పాపులర్ మోటారు సైకిల్ అనడం సందేహం లేదని రాయల్ ఎన్ఫీల్డ్ సీఈఓ బీ గోవిందరాజన్ పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా 20 లక్షల మంది మోటారు బైక్ రైడర్లలో సామాన్యుల మనస్సును హంటర్-350 చూరగొన్నందుకు తమకు గర్వంగా ఉందన్నారు. కేవలం భారతదేశంలో మాత్రమే కాక అంతర్జాతీయ మార్కెట్లలోనూ హంటర్-350కి రోజురోజుకి ఆదరణ పెరుగుతున్నదన్నారు.
రాయల్ ఎన్ ఫీల్డ్ హంటర్-350 రెండు వేరియంట్లలోనూ 349సీసీ సింగిల్ సిలిండర్, ఎస్ఓహెచ్సీ, ఎయిర్ లేదా ఆయిల్ కూల్డ్ ఇంజిన్ విత్ 5-స్పీడ్ గేర్ బాక్స్ కలిగి ఉంటుంది. 6100 ఆర్పీఎంపై 20.2 బీహెచ్పీ, 4000 ఆర్పీఎంపై 27 ఎన్ఎం టార్చి వెలువరిస్తుంది. ఫ్రంట్ అండ్ రేర్ డిస్క్ బ్రేక్‌లు, డ్యుయల్ చానెల్ ఏబీఎస్, ఎల్ఈడీ టెయిల్ లైట్, డ్యుయల్ టోన్ పెయింట్ థీమ్ వంటి ఫీచర్లు ఉంటాయి. రెట్రో వేరియంట్ హంటర్-350 బైక్ రేర్ డ్రమ్ బ్రేక్, సింగిల్ చానెల్ ఏబీఎస్, వైర్ స్పోక్ వీల్స్, సింగిల్ టోన్ కలర్ స్కీమ్స్ ఉన్నాయి. హోండా సీబీ350ఆర్ఎస్, జాబా 42తోపాటు ఇటీవల మార్కెట్లో ఆవిష్కరించిన టీవీఎస్ రొనిన్ మోటారు సైకిళ్లకు రాయల్ ఎన్ఫీల్డ్ హంటర్-350 గట్టి పోటీ ఇస్తున్నది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘విశ్వామిత్ర సేవలు అభినందనీయం’
‘వినియోగదారుల హక్కులపై చైతన్యం కల్పించాలి’
WPL 2027 | ముంబై ఇండియన్స్ ట్రేడింగ్ డీల్.. మహిళా పేసర్‌కు రూ.10 లక్షలు..!
Pawan Kalyan | పవన్ కళ్యాణ్ సినీ ప్రయాణానికి 30 ఏళ్లు.. ఎమోషనల్ పోస్ట్‌తో శుభాకాంక్షలు తెలిపిన అల్లు అరవింద్!
Binod Chaudhary: నేపాలీ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడిగా ఎన్నికైన ఆ దేశ ఏకైక బిలియనీర్
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

