Rinshul Chandra | జొమాటో ఫుడ్ డెలివరీ బిజినెస్ సీవోవో రిన్షుల్ రాజీనామా చేశారు. ఈ నెల 5న ఆయన రాజీనామా చేసినట్లు కంపెనీ పేర్కొంది. వ్యక్తిగత, వృత్తిపరమైన లక్ష్యాలకు అనుగుణంగా కొత్త అవకాశాలు, అభిరుచిని కొనసాగించాలని నిర్ణయించుకున్నానని.. ఈ క్రమంలో తన పదవికి రాజీనామా చేస్తున్నట్లుగా జొమాటో వ్యవస్థాపకుడు, సీఈవో దీపిందర్ గోయల్‌కు రాసిన లేఖలో రిన్షుల్ చంద్ర పేర్కొన్నారు. ఇదిలా ఉండగా.. ఫుడ్ డెలివరీ యాప్ గత ఏడాది ప్రారంభించిన జొమాటో అసోసియేట్ యాక్సిలరేటర్ ప్రోగ్రామ్ కింద దాదాపు 600 మంది కస్టమర్ సపోర్ట్ ఉద్యోగులను తొలగించింది.
కంపెనీ తన కస్టమర్ సపోర్ట్ విభాగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వినియోగాన్ని పెంచుతున్నది. ఈ క్రమంలో గురుగ్రామ్, హైదరాబాద్‌లోని ఉద్యోగులు ప్రభావితమయ్యారు. ఇక జొమాటో దాని మాతృ సంస్థ పేరును ఎటర్నల్ లిమిటెడ్‌గా మార్చింది. జొమాటో ఫుడ్ డెలివరీ బిజినెస్ జొమాటో, క్విక్ కామర్స్ యూనిట్ బ్లింకిట్, గోయింగ్-అవుట్ వర్టికల్ డిస్ట్రిక్ట్, బిజినెస్-టు-బిజినెస్ (B2B) గ్రొసరీస్ సరఫరా కంపెనీ హైపర్ప్యూర్ని నిర్వహిస్తున్నది. కంపెనీ రెండవసారి రీబ్రాండ్ చేసుకుంటోంది. జొమాటో 2008లో ఫుడిబేని స్థాపించింది.. 2010లో జొమాటోగా పేరు మార్చింది. 2022లో బ్లింకిట్ (గతంలో గ్రోఫర్స్) కొనుగోలు తర్వాత మాత్రమే మాతృ సంస్థ అంతర్గతంగా ఎటర్నల్ పేరు అంతర్గతంగా వాడుతున్నప్పటికీ.. గత నెలలో పేరు మారించింది. ఈ సందర్భంగా కొత్త లోగోను సైతం ఆవిష్కరించింది.