హైదరాబాద్: పీఎం స్వనిధి పథకం కింద బ్యాంకుల రుణాలపై తెలంగాణ రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించింది. కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి సంజయ్ కుమార్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో సంబంధిత శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. తొలి దశలో భాగంగా రాష్ట్రంలోని బ్యాంకులు
నిర్దేశిత లక్ష్యాన్ని మించి 3,45,100 మంది వీధి వ్యాపారులకు రుణాలు మంజూరు చేశాయి. పెండింగ్లో ఉన్న దరఖాస్తులనూ పరిశీలించి ఈ నెల 25లోగా రుణాలిచ్చే దిశగా బ్యాంకర్లు
వెళ్తున్నారు.