న్యూఢిల్లీ : 74వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా భారత యూజర్లకు వీఐ (వొడాఫోన్-ఐడియా) తన ప్రీపెయిడ్ కస్టమర్లకు ఉచితంగా 5జీబీ డేటాను ఆఫర్ చేస్తోంది. గణతంత్ర వేడుకల్లో భాగంగా యూజర్లు వారి ప్రీపెయిడ్ ప్లాన్‌కు అనుగుణంగా 5జీబీ లేదా 2జీబీ ఇంటర్నెట్ను ఎలాంటి అదనపు చార్జీలు లేకుండా పొందుతారు. రూ. 199, రూ .299 మధ్య ప్రీపెయిడ్ ప్లాన్స్ కలిగిన కస్టమర్లు అదనంగా 2జీబీ డేటా పొందుతారు.
ఫిబ్రవరి 7వరకూ అందుబాటులో ఉండే ఈ బెనిఫిట్‌ను యూజర్లు యాప్ ద్వారా పొందవచ్చు. అదనపు ఇంటర్నెట్ డేటా వ్యాలిడిటీ 28 రోజుల పాటు మాత్రమే ఉంటుందని వీఐ అధికారిక వెబ్సైట్ పేర్కొంది. యాప్ ద్వారా యూజర్లు రీచార్జ్ చేయించుకుంటే 2జీబీ అదనపు డేటా పొందుతారు.
రూ. 299. రూ. 479, రూ 719 ప్లాన్లు అన్లిమిటెడ్ కాల్స్, డేటా కోసం మెరుగైనవని వీఐ పేర్కొంది. ఇక అదనపు ఇంటర్నెట్ డేటాతో వీఐ యూజర్లు 5జీ స్పీడ్‌ను ఆస్వాదించలేరు. ఎయిర్టెల్, జియో దేశవ్యాప్తంగా పలు నగరాల్లో 5జీని అందుబాటులోకి తీసుకురాగా వీఐ ఇంకా 5జీ సేవలను యూజర్లకు అందుబాటులోకి తీసుకురాలేదు.