హైదరాబాద్ : రెనో క్విడ్ భారతదేశంలో 4 లక్షల మైలురాయిని అధిగమించింది. ఈ ప్రత్యేక సందర్భాన్ని పురస్కరించుకుని హైదరాబాద్‌లో క్విడ్ యజమానులతో కలిసి పీపీఎస్ రెనాల్ట్, ఆర్కా రెనాల్ట్ ఆధ్వర్యంలో రెనో క్విడ్ మైలేజీ ర్యాలీని నిర్వహించారు. ఈ ర్యాలీ మొత్తం 96 కిలోమీటర్ల దూరం సాగింది. హోటల్ రాడిసన్, హైటెక్ సిటీ, గచ్చిబౌలిలో పచ్చజెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు.
ప్రస్తుత క్విడ్ కస్టమర్లు మ్యాగ్జిమం మైలేజీ పొందాలనే ఉద్దేశంతో ఈ ర్యాలీని నెహ్రూ రింగ్ రోడ్డు వ్యాప్తంగా నిర్వహించారు. ఈ ర్యాలీకి అనూహ్యమైన స్పందన లభించింది. 25 కస్టమర్ల కంటే ఎక్కువ మంది ఈ ర్యాలీలో పాల్గొన్నారు. వీరిలో ముగ్గురు కస్టమర్లు అసాధారణంగా 48.81 కేఎంపీఎల్ మైలేజీ నివేదించారు. అద్భుతమైన డిజైన్, సృజనాత్మకతతో కూడిన గొప్ప మైలేజీతో పాటు అమూల్యమైన విలువను అందిస్తుందని క్విడ్ మరోసారి నిరూపించింది.
అంతర్జాతీయ నాణ్యత ప్రమాణాలు, పనితీరును దృష్టిలో ఉంచుకొని భారతీయ కొనుగోలుదారుల కోసం ప్రత్యేకంగా డిజైన్ చేసి రూపొందించిన వాహనం రెనో క్విడ్. “మేక్ ఇన్ ఇండియా” పథకపు సిద్ధాంతాన్ని ఇది బలంగా ప్రతిధ్వనింపజేస్తుంది. భారతీయ అనుభవం, నైపుణ్యాన్ని అందిపుచ్చుకొని అంతర్జాతీయంగా సమర్థవంతమైన ఉత్పత్తులను భారతదేశంతో పాటు మిగిలిన ప్రపంచానికి అందించేందుకు ఇది కృషి చేస్తుంది.
RXE, RXL, RXT, క్లైంబర్ వేరియంట్స్‌తో 0.8 లీటర్లు, 1.0 లీటర్ల SCe మ్యానువల్, AMT ఆప్షన్స్ పవర్‌ట్రెయిన్స్‌తో కూడిన 9 ట్రిమ్స్‌లో అందుబాటులో ఉండే రెనో క్విడ్, భారతదేశంలో రెనో బ్రాండ్ ఎదుగుదలలో కీలకంగా నిలుస్తోంది. ఎస్యూవీ ప్రేరణతో రూపొందించిన డిజైన్, మొట్టమొదటిసారిగా 20.32 సెం.మీటర్ల టచ్ స్క్రీన్, ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ ప్లేతో కూడిన మీడియాన్యావ్, ఫ్లోర్ కన్సోల్ మౌంటెడ్ AMT డయల్ వంటవన్నీ డ్రైవింగ్‌ను శ్రమలేకుండా చేస్తున్నాయి.
10వ వార్షిక వేడుకల సందర్భంగా రెనో ఇటీవలే క్విడ్ MY 21ను లాంచ్ చేసింది. భారతదేశంలో వర్తించే అన్ని సేఫ్టీ నిబంధనలకు కట్టుబడి ఉండే MY21 అన్ని వేరియంట్స్‌లో డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్స్ స్టాండర్డ్ ఫీచర్స్‌గా ఏర్పాటు చేయబడి ఉన్నాయి. కారు ఆకర్షణను మరింత పెంచేందుకు MY21 క్లైంబర్ ఎడిషన్‌లో డ్యూయల్ టోన్ వైట్ అండ్ బ్ల్యాక్ ఎక్స్టీరియల్ కాంబినేషన్‌తో పాటు ఎలక్ట్రిక్ ఓఆర్వీఎం, డే, నైట్ ఐఆర్వీఎం ఉన్నాయి. ముందు భాగంలో డ్రైవర్ సైడు ఉండే పైరోటెక్, ప్రీటెన్షనర్ వాహన భద్రతను మరింత పెంచుతాయి.
క్విడ్ కస్టమర్లు అందరికీ స్పేర్ పార్టులు, విడిభాగాలపై 10% డిస్కౌంట్, లేబర్ ఛార్జీలపై 20% డిస్కౌంట్ సహ అనేక స్పెషల్ ఆఫర్లను రెనో ప్రకటించింది.