t-hub | హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 5 (నమస్తే తెలంగాణ): అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అన్ని రంగాల్లో ఆవిష్కరణలను నిర్వహిస్తున్న టీహబ్… తాజాగా ఆటో మొబైల్ రంగంలో సరికొత్త ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ రెనో- నిస్సాన్‌తో కలిసి ఓపెన్ ఇన్నోవేషన్ చాలెంజ్‌ను నిర్వహిస్తున్నది.
ప్రారంభ దశలో ఉన్న ఆటోమొబైల్ స్టార్టప్‌లతో పాటు కొత్తగా వాహన తయారీకి సంబంధించిన వినూత్న ఆలోచనలు ఉన్న వారు రెనో- నిస్సాన్‌తో కలిసి ఓపెన్ ఇన్నోవేషన్ చాలెంజ్‌లో పాల్గొనవచ్చని టీ హబ్ నిర్వాహకులు తెలిపారు. జనరేటివ్ ఏఐ పరిజ్ఞానంతో వెహికిల్ డిజైన్ డెవలప్మెంట్, అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెంట్ సిస్టమ్స్, ప్రిడిక్టివ్ ఎనలిటిక్స్, కన్వరైజేషనల్ ఏఐ వంటి సాంకేతిక అంశాలతో ఆటో మొబైల్ రంగంలో ఆవిష్కరణలు చేసేందుకు ఈ ఓపెన్ ఇన్నోవేషన్ చాలెంజ్ దోహదం చేస్తుందని, వివరాలకు (https://bit.ly/3TlSTnn)లో సంప్ర దించాలని సూచించింది.