న్యూఢిల్లీ, జనవరి 29: పలు వ్యాధులకు సాంప్రదాయ ఆయుర్వేద వైద్యంగా ఉపయోగించే తిప్పతీగతో ఎన్నో ఉపయోగాలున్నాయన్న పరిశోధనల్ని తాజాగా బ్రిటిష్ ఫార్మా ఆమోదించింది. సోమవారం పతంజలి యోగ్‌పీఠ్ వెల్లడించిన వివరాల ప్రకారం లివర్‌ను ఆరోగ్యకరంగా ఉంచడంలో తిప్పతీగ ఎంతో ప్రయోజనకారి అని పరిశోధనల్లో వెల్లడైనట్టు యునైటెడ్ కింగ్డమ్ (యూకే)లోని ప్రఖ్యాత రీసెర్చ్ జర్నల్ అక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ ప్రచురించిన జర్నల్ ఆఫ్ ఫార్మసీ, ఫార్మాకాలజీ పేర్కొంది.
ఆహారంతోపాటు రోజూ తిప్పతీగను తీసుకుంటే పలు వ్యాధుల నుంచి ఊరట కలుగుతుందని, లివర్‌కు రక్షణ ఇస్తుందని జర్నల్ తెలిపింది. రక్తశుద్ధికి, రోగనిరోధక శక్తి పెంపొందించడానికి తిప్పతీగను పురాతన కాలం నుంచి ఉపయోగిస్తున్నారని పతంజలి యోగపీఠ్ అధినేత ఆచార్య బాలకృష్ణ చెప్పారు. తిప్పతీగ వినియోగంపై కరోనా సమయంలో దుష్ప్రచారం జరగ్గా, పతంజలి రీసెర్చ్ ఇనిస్టిట్యూట్‌లోని శాస్త్రవేత్తలు తిప్పతీగపై పరిశోధనలు జరిపి, దాని ప్రయోజనాల్ని సాక్ష్యాలతో సమర్పించారని గుర్తుచేశారు. పతంజలి గ్రూప్ చేసిన కృషి ఫలితంగా ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తలు ఆయుర్వేదం ప్రాధాన్యతను అంగీకరిస్తున్నారని వివరించారు.