Reliance Online Streaming | దేశంలోనే అతిపెద్ద టీవీ, డిజిటల్ స్ట్రీమింగ్ కంపెనీ ఏర్పాటు దిశగా అడుగులు పడ్డాయి. ఈ మేరకు బోధీ ట్రీ సిస్టమ్స్‌లో వ్యూహాత్మక భాగస్వామ్యంలో అడుగు పెడుతున్నట్లు రిలయన్స్ ఇండస్ట్రీస్, వయాకాం-18 బుధవారం ప్రకటించాయి. జేమ్స్ మర్డోచ్ లుపా సిస్టమ్స్ అండ్ ఉదయ్ శంకర్ ప్లాట్ ఫాం బోధీ ట్రీ సిస్టమ్స్. వయాకాం-18లో కన్సార్టియం ద్వారా రూ.13,500 కోట్ల నిధులు సేకరణలో బోధి ట్రీ సిస్టమ్స్ ముందు ఉంటాయని రిలయన్స్ ఓ ప్రకటనలో తెలిపింది. తాము సంయుక్తంగా దేశంలో అగ్రశ్రేణి ఎంటర్టైన్మెంట్ కంపెనీ ఏర్పాటు చేస్తామని పేర్కొంది. వయాకాం-18 మున్ముందు టీవీ చానెళ్లు, ఓటీటీ ప్లాట్‌ఫామ్, వూట్ నిర్వహిస్తుంది.
ఇందుకోసం రిలయన్స్ ప్రాజెక్ట్స్ అండ్ ప్రాపర్టీ మేనేజ్మెంట్స్ రూ.1645 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నది. రిలయన్స్ అనుబంధ సంస్థ అయిన రిలయన్స్ ప్రాజెక్ట్స్ అండ్ ప్రాపర్టీ మేనేజ్మెంట్స్.. ఇప్పటికే టెలివిజన్, ఓటీటీ, డిస్ట్రిబ్యూషన్, కంటెంట్ క్రియేషన్, ప్రొడక్షన్ కార్యకలాపాలు గణనీయ స్థాయిలో నిర్వహిస్తున్నది. దీనికి అదనంగా ప్రజాదరణ పొందిన జియో సినిమా ఓటీటీ యాప్‌ను వయాకాం-18కి బదిలీ చేస్తారు.