Jio New Year offer | యూజర్లకు అద్భుత ఆఫర్లు అందించడంలో ముందు ఉన్న టెలికం సంచలనం రిలయన్స్ జియో తాజాగా మరో ఆఫర్ ప్రకటించింది. నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో తన ఖాతాదారులకు సరికొత్త ఆఫర్ అందుబాటులోకి తెచ్చింది. వార్షిక ప్లాన్ కింద ఇప్పుడు 336 రోజుల ప్రీపెయిడ్ ప్లాన్‌ను 365 రోజులకు పొడిగిస్తున్నట్లు తెలిపింది. అంటే రూ.2245 ప్రిపెయిడ్ ప్లాన్‌పై అదనంగా 29 రోజుల వ్యాలిడిటీ అందిస్తున్నది. ఈ ఆఫర్ వచ్చేనెల రెండో తేదీ వరకు లభిస్తుందని పేర్కొంది.
వార్షిక ప్లాన్ కింద రీచార్జి చేసుకున్న యూజర్లు ప్రతిరోజూ 1.5 జీబీ డేటా పొందడంతోపాటు 100 ఎస్సెమ్మెస్‌లు పంపొచ్చు. అన్ లిమిటెడ్ వాయిస్ కాల్స్ చేసుకునే వెసులుబాటు కల్పిస్తున్నది. ఇంకా పాటు జియో టీవీ, జియో సినిమా, జియో సెక్యూరిటీ, జియో క్లౌడ్ సబ్స్క్రిప్షన్ ఉచితంగా లభిస్తుంది. ఈ ఆఫర్ దీర్ఘకాలం ప్లాన్ తీసుకునే వారికి ఉపయోగ పడుతుంది. కొత్తగా జియో సిమ్ తీసుకున్న వారు కూడా ఈ ఆఫర్ పొందొచ్చు.