Reliance Jio |ప్రముఖ టెలికం సంస్థ రిలయన్స్ జియో తన యూజర్లకు న్యూ ప్రీపెయిడ్ రీచార్జి ప్లాన్ ప్రకటించింది. 84 రోజుల వ్యాలిడిటీ గల ఈ ప్లా్న్ కింద అన్ లిమిటెడ్ వాయిస్ కాలింగ్ ఫెసిలిటీ ఉంటుంది. రూ.909 డేటా ప్లాన్ కింద ప్రతి రోజూ 2జీబీ హైస్పీడ్ డేటా అందడంతోపాటు 100 ఎస్ఎంఎస్లు పంపుకోవచ్చు. వీటితోపాటు సోనీ లివ్, జీ5 తోపాటు పలు ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ సబ్స్క్రిప్షన్లు ఉంటాయి. జియో సినిమా, జియో టీవీ, జియో క్లౌడ్ వంటి జియో యాప్స్ ఉచితంగా పొందొచ్చు. అర్హులైన కస్టమర్లు అన్ లిమిటెడ్ 5జీ కవరేజీ పొందొచ్చు. అయితే జియో సినిమా కాంప్లిమెంటరీ సబ్స్క్రిప్షన్ కింద జియో సినిమా ప్రీమియం చేర్చలేదు.
ఎయిర్ టెల్, వొడాఫోన్ ఐడియా, బీఎస్ఎన్ఎల్లతో పోటీ పడేందుకు నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్రిప్షన్‌తోపాటు రిలయన్స్ జియో మరో రెండు ప్లాన్లు అందుబాటులోకి తెచ్చింది. రూ.1099 ప్లాన్ కింద ప్రతి రోజూ 2జీబీ డేటా, రూ.1499 ప్లాన్ కింద 3జీబీ డేటా అందిస్తోంది. ఈ రెండు ప్లాన్ల కింద రోజూ 100 ఎస్ఎంఎస్లు, అన్ లిమిటెడ్ వాయిస్‌కాల్స్ పొందొచ్చు.