న్యూఢిల్లీ, సెప్టెంబర్ 19: దేశంలో అతిపెద్ద ఎలక్ట్రానిక్ రిటైల్ దిగ్గజం రిలయన్స్ డిజిటల్…ఐఫోన్ 16పై ప్రత్యేక ఆఫర్లను ప్రకటించింది. ప్రస్తుత పండుగ సీజన్లో కొనుగోలుదారులను ఆకట్టుకోవాలనే ఉద్దేశంతో ఐఫోన్ 16 ప్లస్ ధరను రూ.57,990కి తగ్గించిన సంస్థ.. ఐఫోన్ 16ఈ ధరను రూ.42,990కి దించింది.
ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న ఐఫోన్లలో 16ఈ అత్యంత చౌకది కావడం విశేషం. ఈ ఆఫర్ స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే అందుబాటులో ఉండనున్నది.