న్యూఢిల్లీ, మే 9 : ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లలోకి పెట్టుబడులు భారీగా తగ్గాయి. గత నెలలో ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లలోకి పెట్టుబడులు ఏడాది ప్రాతిపదికన 3.24 శాతం తగ్గి రూ.24,269 కోట్లకు పరిమితమైనట్టు అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్ ఇండియా(ఆంఫీ) విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది. భారత్-పాకిస్థాన్ దేశాల మధ్య ఉద్రిక్తత పరిస్థితులు నెలకొనడంతో మార్కెట్లు తీవ్ర ఒడిదొడుకులకు లోనయ్యాయని, ఫలితంగా మదుపరులు ఈక్విటీ ఎంఎఫ్ల్లోకి పెట్టుబడులను తగ్గించుకుంటున్నారు.
వరుసగా నాలుగో నెలలో కూడా పెట్టుబడులు తగ్గుముఖం పట్టడం విశేషం. మరోవైపు, డెబిట్ ఫండ్స్ రూ.2.02 లక్షల కోట్ల నుంచి రూ.2.19 లక్షల కోట్లకు చేరుకున్నాయి. మార్చి చివరినాటికి రూ.65.74 లక్షల కోట్లుగా ఉన్న మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీ ఆ మరుసటి నెలకి రూ.70 లక్షల కోట్ల మైలురాయిని అధిగమించింది. – మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీ నికర ఏయూఎం విలువ రూ.69,99,837.94 కోట్లుగా నమోదైంది. మార్చి నెల చివరినాటికి ఇది రూ.65,74,287.20 కోట్లుగా ఉన్నది. – ఫండ్లలో పెట్టుబడులు పెట్టిన వారు 23,62,95,024గా ఉన్నారు.