Redmi Note 14 5G | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ రెడ్మీ నోట్ 14 5జీ (Redmi Note 14 5G) ఫోన్‌ను చైనా మార్కెట్లో ఆవిష్కరించింది. దీంతోపాటు రెడ్మీ నోట్ 14 ప్రో+ 5జీ (Redmi Note 14 Pro+ 5G), రెడ్మీ నోట్ 14ప్రో 5జీ (Redmi Note 14 Pro 5G) ఫోన్లను ఆవిష్కరించింది. ఆండ్రాయిడ్ 14 బేస్డ్ షియోమీ హైపర్ ఓఎస్ ఔటాఫ్ బాక్స్ వర్షన్‌పై పని చేస్తుంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ తో 6.67 అంగుళాల అమోలెడ్ డిస్ ప్లే కలిగి ఉంటది. 45వాట్ల వైర్డ్ ఫాస్ట్ చార్జింగ్ మద్దతుతో 5110 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీతో వస్తోంది.
రెడ్మీ నోట్ 14 5జీ (Redmi Note 14 5G) ఫోన్ 6జీబీ ర్యామ్ విత్ 128 జీబీ స్టోరేజీ వేరియంట్ సుమారు రూ.14,300 (1199 చైనా యువాన్లు), 8 జీబీ ర్యామ్ విత్ 128 జీబీ స్టోరేజీ వేరియంట్ దాదాపు రూ.16,700 (1399 చైనా యువాన్లు), 8 జీబీ ర్యామ్ విత్ 256 జీబీ స్టోరేజీ వేరియంట్ దాదాపు రూ.17,900 (1499 చైనా యువాన్లు), 12 జీబీ ర్యామ్ విత్ 256 జీబీ స్టోరేజీ వేరియంట్ సుమారు రూ.20,300 (1699 చైనా యువాన్లు) పలకుతుంది. మిడ్ నైట్ బ్లాక్, ఫాంటం బ్లూ, స్టార్ వైట్ రంగుల్లో లభిస్తుంది. త్వరలో భారత్, గ్లోబల్ మార్కెట్లలో ఈ ఫోన్ ఆవిష్కరిస్తారని తెలుస్తోంది.
రెడ్మీ నోట్ 14 5జీ (Redmi Note 14 5G) ఫోన్ 45వాట్ల వైర్డ్ ఫాస్ట్ చార్జింగ్ మద్దతుతో 5110 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీతో వస్తుంది. సెక్యూరిటీ కోసం ఇన్ డిస్ ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్ కలిగి ఉంటుంది. 5జీ, 4జీ ఎల్టీఈ, వై-ఫై, బ్లూటూత్ 5.3, జీపీఎస్, గ్లోనాస్, యూఎస్బీ టైప్ సీ పోర్ట్ కనెక్టివిటీ కలిగి ఉంటది.