Redmi Note 13 Series | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ షియోమీ అనుబంధ రెడ్మీ తన రెడ్మీ నోట్ 13 సిరీస్ ఫోన్లను ఈ నెల నాలుగో తేదీన భారత్ మార్కెట్లో ఆవిష్కరించనున్నది. రెడ్మీ నోట్13 5జీ, రెడ్మీ నోట్13ప్రో 5జీ, రెడ్మీ నోట్13 ప్రో+ 5జీ ఫోన్లు మార్కెట్లోకి రానున్నాయి. అన్ని ఫోన్లు 6.67-అంగుళాల 1.5 కే ఫుల్ హెచ్డీ + అమోలెడ్ స్క్రీన్, 16-మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరాలు ఉంటాయి. ఈ-కామర్స్ ప్లాట్ఫామ్స్ అమెజాన్, ఫ్లిప్కార్ట్ ద్వారా ఈ ఫోన్లను విక్రయిస్తామని ధ్రువీకరించింది.
రెడ్మీ నోట్13 5జీ ఫోన్ 6జీబీ ర్యామ్ విత్ 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్ ధర రూ.20,999, 8 జీబీ ర్యామ్ విత్ 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్ ధర రూ.22,999, 12 జీబీ ర్యామ్ విత్ 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్ రూ.24,999 పలుకుతాయని భావిస్తున్నారు. ఈ ఫోన్ ప్రిజమ్ గోల్డ్, ఆర్కిటిక్ వైట్, స్టెల్త్ బ్లాక్ షేడ్ కలర్స్ లో లభిస్తుంది.
రెడ్మీ నోట్13 ప్రో 5జీ ఫోన్ ఆర్కిటిక్ వైట్, కోరల్ పర్పుల్, మిడ్ నైట్ బ్లాక్ కలర్స్ ఆప్షన్లలో లభిస్తుంది. ఈ ఫోన్ 8 జీబీ ర్యామ్ విత్ 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ రూ.28,999, 12 జీబీ ర్యామ్ విత్ 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్ రూ.32,999 ఉండవచ్చునని తెలుస్తుంది.
రెడ్మీ నోట్ 13 ప్రో + 5జీ ఫోన్ 8జీబీ ర్యామ్ విత్ 256 జీబీ ఇంటర్నల్ వేరియంట్ ధర రూ.33,999, 12 జీబీ ర్యామ్ విత్ 256 జీబీ ఇంటర్నెట్ వేరియంట్ ధర రూ.35,999, 12 జీబీ ర్యామ్ విత్ 512 జీబీ ఇంటర్నెట్ వేరియంట్ రూ.37,999 పలుకుతుందని సమాచారం. ఫుషన్ వైట్, ఫుషన్ పర్పుల్, ఫుషన్ బ్లాక్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.
రెడ్మీ నోట్13 సిరీస్ ఫోన్లలో రెడ్మీ నోట్ 13 5జీ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 6080 ఎస్వోసీ చిప్ సెట్, రెడ్మీ నోట్ 13ప్రో, రెడ్మీ నోట్ 13 ప్రో+ ఫోన్లు క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 7 జెన్ 2, మీడియాటెక్ డైమెన్సిటీ 7200 ఆల్ట్రా చిప్ సెట్ కలిగి ఉంటాయి.