Redmi Note 13 Pro 5G | ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ రెడ్మీ (Redmi) తన రెడ్మీ నోట్ 13 ప్రో 5జీ (Redmi Note 13 Pro), రెడ్మీ నోట్ 13 5జీ (Redmi Note 13), రెడ్మీ నోట్ 13 ప్రో+ 5జీ (Redmi Note 13 Pro+) ఫోన్లను గత జనవరిలో భారత్ మార్కెట్లో ఆవిష్కరించింది. ప్రో వర్షన్ ఫోన్ మూడు రంగుల్లో అందుబాటులో ఉంది. ప్రస్తుతం సెలెక్టెడ్ గ్లోబల్ మార్కెట్లలో నాలుగో రంగులోనూ అందుబాటులోకి రానున్నది. భారత్ మార్కెట్లోకి ఎప్పుడు వస్తుందన్న సంగతి తెలియరాలేదు.
రెడ్మీ నోట్ 13 ప్రో 5జీ (Redmi Note 13 Pro 5G) ఫోన్ ఆలీవ్ గ్రీన్ (Olive Green) కలర్ ఆప్షన్ లో కూడా రానున్నది. ఇంతకుముందు అరోరా పర్పుల్, మిడ్ నైట్ బ్లాక్, ఓషన్ టీల్ రంగుల్లో మార్కె్ట్లోకి వచ్చింది. భారత్ మార్కెట్లో ఆర్కిటిక్ వైట్, కోరల్ పర్పుల్, మిడ్ నైట్ బ్లాక్ రంగుల్లో లభిస్తుంది.
రెడ్మీ నోట్ 13 ప్రో 5జీ (Redmi Note 13 Pro 5G) ఫోన్ 8జీబీ ర్యామ్ విత్ 128 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.24,999, 8జీబీ ర్యామ్ విత్ 256 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.26,999, 12 జీబీ ర్యామ్ విత్ 256 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.28,999 ధరల్లో లభిస్తుంది. రెడ్మీ నోట్ 13 ప్రో 5జీ (Redmi Note 13 Pro 5G) ఫోన్ 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్, 1800 నిట్స్ పీక్ బ్రైట్ నెస్‌తోపాటు 6.67 అంగుళాల 1.5 కే (1220×2712 పిక్సెల్స్) రిజొల్యూషన్, కర్వ్డ్ అమోలెడ్ స్క్రీన్ కలిగి ఉంటది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్రొటెక్షన్ కూడా వస్తుంది. క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 7ఎస్ జెన్ 2 ప్రాసెసర్, 12 జీబీ ర్యామ్ విత్ 256 జీబీ ఆన్ బోర్డ్ స్టోరేజీ కెపాసిటీ కలిగి ఉంటుంది. ఆండ్రాయిడ్ 14 బేస్డ్ ఎంఐయూఐ 14 ఓఎస్ వర్షన్‌పై పని చేస్తుంది.
రెడ్మీ నోట్ 13 ప్రో 5జీ (Redmi Note 13 Pro 5G) ఫోన్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (ఓఐఎస్) మద్దతుతో 200 -మెగా పిక్సెల్ ప్రైమరీ రేర్ సెన్సర్ కెమెరాతోపాటు ట్రిపుల్ రేర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 8-మెగా పిక్సెల్ సెన్సర్ విత్ ఆల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ కెమెరా, 2-మెగా పిక్సెల్ మాక్రో షూటర్, సెల్ఫీలూ వీడియో కాల్స్ కోసం 16-మెగా పిక్సెల్ సెన్సర్ కెమెరా ఉంటాయి.
రెడ్మీ నోట్ 13 ప్రో 5జీ ఫోన్ 67వాట్ల వైర్డ్ ఫాస్ట్ చార్జింగ్ మద్దతుతో 5100 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీతో వస్తోంది. 5జీ, వై-ఫై, జీపీఎస్, ఎన్ఎఫ్సీ, బ్లూ టూత్ 5.2, యూఎస్బీ టైప్ సీ పోర్ట్ కనెక్టివిటీ కలిగి ఉంటది. సెక్యూరిటీ, బయో మెట్రిక్ అథంటికేషన్ కోసం ఇన్ డిస్ ప్లే ఫింగర్ ప్రింట్ సెన్ర్ ఉంటది. డస్ట్ అండ్ స్ప్లాష్ రెసిస్టెన్స్ కోసం ఐపీ54 రేటింగ్ అందుకున్నది.