Reddit CEO : తన వేతన ప్యాకేజ్‌పై విమర్శలు వెల్లువెత్తడంతో రెడ్డిట్ సీఈవో స్టీవ్ హఫ్‌మన్ స్పందించారు. తన భారీ వేతన ప్యాకేజ్‌ను ఆయన సమర్ధించుకున్నారు. దాదాపు రూ. 1600 కోట్ల వేతన ప్యాకేజ్‌ను హఫ్‌మన్ అందుకోవడంపై కోరా, రెడ్డిట్, ఎక్స్ వంటి పలు ప్లాట్‌ఫాంలపై యూజర్ల మధ్య హాట్ డిబేట్ సాగింది.
ఇంతటి భారీ ప్యాకేజ్ అవసరమా..అసలు ఇంతటి ప్యాకేజ్ సక్రమమేనా అంటూ యూజర్లు కామెంట్స్ చేశారు. ఈ వివాదంపై రెడ్డిట్ సీఈవో స్టీవ్ హఫ్‌మన్ రెడ్డిట్ వేదికగా క్యూ అండ్ ఏ సెషన్లో రియాక్టయ్యారు. తన సామర్ధ్యం ఆధారంగా రెడ్డిట్ బోర్డ్ తన వేతన ప్యాకేజ్‌ను నిర్ధారించిందని స్పష్టం చేశారు.
హఫ్‌మన్ వేతనం ఓ ప్రముఖ పబ్లిక్ కార్పొరేషన్ సీఈవోకు దీటుగా ఉంటుంది. రెడ్డిట్ పబ్లిక్ కంపెనీగా మారడానికి సంసిద్ధంగా ఉన్నందున హఫ్‌మన్ కంపెనీలో తన వాటాల ద్వారా భారీ మొత్తం ఆర్జించనున్నారు. మార్క్ జుకర్‌బర్గ్, ఎలన్ మస్క్‌ల వేతన ప్యాకేజ్‌తో కొందరు హఫ్‌మన్ పే ప్యాకేజ్‌ను పోలిక తీసుకువస్తున్నారు.
Read More :
Couple Thrashed | షాకింగ్.. ఇంటి ముందు కారు పార్క్ చేశారని దంపతులపై దాడి.. VIDEO