Realme Narzo N63 | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ రియల్మీ తన రియల్మీ నార్జో ఎన్63 ఫోన్‌ను బుధవారం భారత్ మార్కెట్లో ఆవిష్కరించింది. ఒక్టాకోర్ చిప్ సెట్, ఏఐ బ్యాక్డ్ 50-మెగా పిక్సెల్ మెయిన్ కెమెరా, 45వాట్ల వైర్డ్ ఫాస్ట్ చార్జింగ్ మద్దతుతో 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీలతో వస్తోంది. ఈ నెలాఖరులో రెండు ర్యామ్ – స్టోరేజీ వేరియంట్లలో లభిస్తుందీ ఫోన్. ‘ప్రీమియం వెగాన్ లెదర్’ ఆప్షన్‌తో వస్తున్నది. గతేడాది మేలో భారత్ మార్కెట్లో ఆవిష్కరించిన రియల్ మీ నార్జో ఎన్53 కొనసాగింపుగా ఈ ఫోన్ ఆవిష్కరించారు.
రియల్మీ నార్జో ఎన్63 ఫోన్ 4జీబీ ర్యామ్ విత్ 64 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.8,499, 4జీబీ ర్యామ్ విత్ 128 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.8,999లకు లభిస్తాయి. అమెజాన్, రియల్మీ ఇండియా వెబ్సైట్ల ద్వారా ఈ నెల 10 మధ్యాహ్నం 12 గంటల నుంచి సేల్స్ ప్రారంభం అవుతాయి. ఈ నెల 14 వరకూ ఫస్ట్ సేల్ కొనసాగుతుంది.
రియల్మీ వెబ్ సైట్ ద్వారా కొనుగోలు చేసిన వారికి రూ.500 కూపన్ ఇస్తుండటంతో రియల్ మీ నార్జో ఎన్63 ఫోన్ 4జీబీ ర్యామ్ విత్ 64 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.7,999, 4జీబీ ర్యామ్ విత్ 128 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.8,499లకు లభిస్తాయి. లెదర్ బ్లూ, ట్విలైట్ పర్పు్ల్ కలర్ ఆప్షన్లలో లభిస్తుందీ ఫోన్.
రియల్మీ నార్జో ఎన్63 ఫోన్ 90 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్, 180 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేటు, 450 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తోపాటు 6.74 అంగుళాల హెచ్డీ+ (1600×720 పిక్సెల్స్) ఐపీఎస్ ఎల్సీడీ స్క్రీన్ కలిగి ఉంటుంది. రియల్మీ నార్జో ఎన్63 ఫోన్ ఏఐ బ్యాక్డ్ 50-మెగా పిక్సెల్ సెన్సర్ కెమెరా, సెల్ఫీలూ వీడియో కాల్స్ కోసం 8-మెగా పిక్సెల్ సెన్సర్ కెమెరా ఉంటాయి. ఎయిర్ గెస్చర్, డైనమిక్ బటన్, మినీ క్యాప్సూల్ 2.0 సాఫ్ట్వేర్ ఫీచర్లు ఉంటాయి.
రియల్మీ నార్జో ఎన్63 ఫోన్ 45వాట్ల వైర్డ్ ఫాస్ట్ చార్జింగ్ మద్దతుతో 5,000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీ ఉంటుంది. 4జీ వోల్ట్, వై-ఫై, బ్లూటూత్ 5.0, జీపీఎస్, గ్లోనస్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్ కనెక్టివిటీ కలిగి ఉంటుంది. బయో మెట్రిక్ అథంటికేషన్ కోసం సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ ఉంటుంది. ఈ ఫోన్ ఐపీ54 రేటింగ్ ఫర్ డస్ట్ అండ్ స్ప్లాష్ రెసిస్టెన్స్ కలిగి ఉంటది.