Realme GT 7 Pro | ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ రియల్మీ (Realme) తన ప్రీమియం ఫోన్ రియల్మీ జీటీ7 ప్రో (Realme GT 7 Pro) ను భారత్ మార్కెట్లో ఆవిష్కరించింది. రియల్మీ జీటీ7 ప్రో (Realme GT 7 Pro) ఫోన్ 12 జీబీ ర్యామ్ విత్ 256 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.59,999, 16 జీబీ ర్యామ్ విత్ 512 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.65,999 పలుకుతుంది. ఈ నెల 29 మధ్యాహ్నం 12 గంటల నుంచి రియల్మీ జీటీ7 ప్రో (Realme GT 7 Pro) ఫోన్ విక్రయాలు ప్రారంభం అవుతాయి. రియల్మీ వెబ్సైట్, ఈ-కామర్స్ ప్లాట్ఫామ్ అమెజాన్ల్లో ఫోన్లు లభిస్తాయి. మార్స్ ఆరెంజ్ (Mars Orange), గెలాక్సీ గ్రే (Galaxy Grey) రంగుల్లో లభిస్తుందీ ఫోన్.
రియల్మీ జీటీ7 ప్రో (Realme GT 7 Pro) ఫోన్ 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేటుతోపాటు 6.78 అంగుళాల ఎల్టీపీఓ అమోలెడ్ ఫుల్ హెచ్డీ+ రిజొల్యూషన్ డిస్ ప్లే కలిగి ఉంటుంది. క్వాడ్ కర్వ్డ్ స్క్రీన్ విత్ సపోర్ట్స్ డోల్బీ విజన్ అండ్ హెచ్డీఆర్ 10+ కంటెంట్ తో వస్తుంది. ఏజీ గ్లాస్ రేర్ ప్యానెల్ విత్ అల్యూమినియం ఉంటుంది. క్వాల్ కామ్ 8 స్నాప్ డ్రాగన్ 8 ఎలైట్ ఎస్వోసీతో వస్తున్న తొలి స్మార్ట్ ఫోన్ ఇది. సోనీ ఐఎంఎక్స్906 50-మెగా పిక్సెల్ ప్రైమరీ కెమెరా, సోనీ ఐఎంఎక్స్ 882 50-మెగా పిక్సెల్ టెలిఫోటో కెమెరా, సోనీ ఐఎంఎక్స్ 355 8-మెగా పిక్సెల్ ఆల్ట్రావైడ్ కెమెరా, సెల్ఫీలూ వీడియో కాల్స్ కోసం 16-మెగా పిక్సెల్ కెమెరా ఉంటుంది. ఆండ్రాయిడ్ 15 బేస్డ్ రియల్మీ యూఐ 6.0 వర్షన్ పై పని చేస్తుంది. మూడేండ్ల పాటు సాఫ్ట్ వేర్ అప్ డేట్స్, నాలుగేండ్ల పాటు సెక్యూరిటీ అప్ డేట్స్ అందిస్తుంది.
రియల్మీ జీటీ7 ప్రో (Realme GT 7 Pro) ఫోన్ చైనా మోడల్ ఫోన్ 6500 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీతో వస్తే, ఇండియా మోడల్ 5,800 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీతో వస్తుంది. ఈ బ్యాటరీకి 120 వాట్ల ఫాస్ట్ చార్జింగ్ మద్దతు ఉంటుంది. రియల్మీ జీటీ7 ప్రో (Realme GT 7 Pro) ఫోన్ కేవలం 30 నిమిషాల్లో చార్జింగ్ అవుతుంది.