Realme GT 7 Pro | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ రియల్మీ (Realme) తన ఫ్లాగ్ షిప్ ఫోన్ రియల్మీ జీటీ7 ప్రో (Realme GT7 Pro) ఫోన్ ఈ నెల 26న భారత్ మార్కెట్లో ఆవిష్కరించనున్నది. ఈ నేపథ్యంలో అమెజాన్, ఆఫ్ లైన్ చానల్స్ లో ఈ నెల 18వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి ప్రీ బుకింగ్స్ ప్రారంభం అవుతాయి. ఆసక్తి గల వారు అమెజాన్ లో రూ.1000 చెల్లించి ఫోన్ బుక్ చేసుకోవచ్చు. దీంతోపాటు రూ.3000 బ్యాంక్ ఆఫర్ కూడా పొందొచ్చు. 12 నెలల నో కాస్ట్ ఈఎంఐ, ఏడాది పాటు స్క్రీన్ డ్యామేజ్ ఇన్సూరెన్స్, ఏడాదిపాటు అదనపు వారంటీ లభిస్తుంది. క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్ తో వస్తోంది. బేస్ వేరియంట్ సుమారు రూ.44 వేలు, టాప్ వేరియంట్ రూ.57 వేలకు లభించనున్నది.
రియల్మీ జీటీ7 ప్రో (Realme GT7 Pro) ఫోన్ ఇండియా ఫోన్ స్పెషిఫికేషన్స్ ఇంకా వెల్లడించలేదు. కానీ చైనా మార్కెట్లో 6.78 అంగుళాల 1.5 కే 8టీ ఎల్టీపీఓ కర్వ్డ్ అమోలెడ్ డిస్ ప్లే, 6000 నిట్స్ పీక్ బ్రైట్ నెస్ విత్ 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్ కలిగి ుంటుంది. హెచ్డీఆర్10+, డోల్బీ విజన్, 2600 హెర్ట్జ్ ఇన్ స్టంట్ టచ్ శాంప్లింగ్ రేట్, 120శాతం డీసీఐ-పీ3 కలర్ గమట్, 2600 హెర్ట్జ్ పీడబ్ల్యూఎం డిమ్మింగ్ తదితర ఫీచర్లు ఉంటాయి. క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్ తో పని చేస్తుంది. 16 జీబీ ర్యామ్ విత్ ఒక టిగా బైట్ స్టోరేజీ కెపాసిటీ కలిగి ఉంటుంది.
ఆండ్రాయిడ్ 14 బేస్డ్ రియల్మీ యూఐ 6.0 ఓఎస్ వర్షన్‌పై ఫోన్ పని చేస్తుందీ రియల్మీ జీటీ7 ప్రో ఫోన్. మూడేండ్ల పాటు ఓఎస్ అప్ డేట్స్, నాలుగేండ్లు సెక్యూరిటీ అప్ డేట్స్ అందిస్తుంది. 120 వాట్ల ఫాస్ట్ చార్జింగ్ మద్దతుతో 6500 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ ట్రిపుల్ రేర్ కెమెరా సెటప్ తో వస్తుంది. ఇందులో 50-మెగా పిక్సెల్ ప్రైమరీ సెన్సర్ కెమెరా, 50-మెగా పిక్సెల్ సోనీ ఐఎంఎక్స్882 3ఎక్స్ టెలిఫోటో లెన్స్, 8 మెగా పిక్సెల్ ఆల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్, సెల్ఫీలూ వీడియో కాల్స్ కోసం 16-మెగా పిక్సెల్ సెన్సర్ కెమెరా ఉంటాయి.