Realme C63 5G | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ రియల్మీ మరో బడ్జెట్ ఫ్రెండ్లీ రియల్మీ సీ63 5జీ (Realme C63 5G) ఫోన్ ను సోమవారం భారత్ మార్కెట్లో ఆవిష్కరించింది. మీడియాటెక్ డైమెన్సిటీ 6300 5జీ ప్రాసెసర్ తో పని చేస్తుందీ ఫోన్. 8 జీబీ ర్యామ్ విత్ 128 జీబీ ఇన్ బిల్ట్ స్టోరేజీతో వస్తుంది. 10వాట్ల ఫాస్ట్ చార్జింగ్ మద్దతుతో 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీ కలిగి ఉంటది. రెండు రంగుల ఆప్షన్లలో వస్తున్న రియల్ మీ సీ63 5జీ (Realme C63 5G) ఫోన్ ‘రియల్మీ మినీ క్యాప్సూల్ 2.0’ కలిగి ఉంటుంది.
రియల్మీ సీ63 5జీ (Realme C63 5G) ఫోన్ 4 జీబీ ర్యామ్ విత్ 128 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.10,999, 6జీబీ ర్యామ్ విత్ 128 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.11,999, 8 జీబీ ర్యామ్ విత్ 128 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.12,999 లకు లభిస్తాయి. ఈ నెల 20 మధ్యాహ్నం 10 గంటలకు రియల్ మీ ఇండియా వెబ్ సైట్, ఫ్లిప్ కార్ట్ ద్వారా ఫస్ట్ సేల్ ప్రారంభం అవుతుంది. ఇంట్రడ్యూసరీ సేల్ కింద కస్టమర్లకు సెలెక్టెడ్ బ్యాంకు కార్డులపై రూ.1000 డిస్కౌంట్ అందిస్తోంది.
రియల్మీ సీ63 5జీ (Realme C63 5G) ఫోన్ ఆండ్రాయిడ్ 14 బేస్డ్ రియల్ మీ యూఐ 5.0 వర్షన్ పై పని చేస్తుంది. మూడేండ్లు సెక్యూరిటీ అప్ డేట్స్, రెండేండ్లు ఆండ్రాయిడ్ సాఫ్ట్ వేర్ అప్ డేట్స్ అందిస్తుంది. 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేటుతోపాటు 6.67 అంగుళాల హెచ్డీ+ (720×1604 పిక్సెల్స్) డిస్ ప్లే, 625 నిట్స్ పీక్ బ్రైట్ నెస్, 240 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్ కలిగి ఉంటుంది.
రియల్మీ సీ63 5జీ (Realme C63 5G) ఫోన్ 32-మెగా పిక్సెల్ ఏఐ బ్యాక్డ్ మెయిన్ రేర్ కెమెరా, సెల్ఫీలూ వీడియో కాల్స్ కోసం 8-మెగా పిక్సెల్ కెమెరా ఉంటాయి. మైక్రో ఎస్డీ కార్డు సాయంతో ఫోన్ స్టోరేజీ కెపాసిటీ రెండు టిగాబైట్ల వరకూ పెంచుకోవచ్చు. వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్, యూఎస్బీ టైప్ సీ పోర్ట్ కనెక్టివిటీ కలిగి ఉంటుంది. 10వాట్ల ఫాస్ట్ చార్జింగ్, రివర్స్ చార్జింగ్ మద్దతుతో 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీతో వస్తుంది. సింగిల్ చార్జింగ్ తో 40.1 గంటల కాలింగ్ టైం, 29 రోజుల స్టాండ్ బై టైం బ్యాటరీ లైఫ్ ఉంటుంది.